ETV Bharat / sports

'కుల్​దీప్​పై బోర్డుది సవతి తల్లి ప్రేమ'

author img

By

Published : Jun 11, 2021, 6:00 PM IST

టీమ్ఇండియా స్పిన్నర్​ కుల్​దీప్ యాదవ్​ శ్రీలంక పర్యటనకు ఎంపిక కావడంపై అతని చిన్ననాటి కోచ్​ కపిల్ దేవ్​ పాండే స్పందించారు. జట్టులోకి ఎంపిక చేసిన అతడిని తుది జట్టులో ఆడించకపోవడం "సవతి తల్లి ప్రేమలా" ఉందని అభిప్రాయపడ్డాడు.

kuldeep yadav, indian cricketer
కుల్​దీప్ యాదవ్, టీమ్​ఇండియా స్పిన్నర్

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు తనని ఎంపిక చేయకపోవడంపై టీమ్‌ఇండియా మణికట్టు లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ బాధపడ్డాడని.. అతని చిన్ననాటి కోచ్​ కపిల్​ దేవ్​ పాండే తెలిపారు. అయినా దాని గురించి మర్చిపోయి శ్రీలంక పర్యటనపై దృష్టి సారించాడని పేర్కొన్నారు. తాజాగా లంక పర్యటనకు సంబంధించి బీసీసీఐ శిఖర్‌ ధావన్‌ కెప్టెన్సీలో యువ ఆటగాళ్ల బృందాన్ని ఎంపిక చేసింది. అందులో కుల్‌దీప్​కు కూడా చోటు దక్కింది.

"కుల్‌దీప్‌ బౌలింగ్‌లో గూగ్లీ బంతులే ప్రధాన అస్త్రాలు. ఆ బంతులు ఎప్పుడూ అతడికి వికెట్లు దక్కేలా చేసేవి. అయితే, ఇటీవలి కాలంలో సరైన లెంగ్త్‌లో బౌలింగ్‌ చేయలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఏదో ఒక బంతి సరైన లెంగ్త్‌లో పడటం తప్ప మిగతావన్నీ ఎక్కడెక్కడో పిచ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే వారం రోజులుగా తన బౌలింగ్‌పై ప్రత్యేక దృష్టిసారించాడు. బాగా సాధన చేసి సరైన లెంగ్త్‌తో ఇప్పుడు బంతులు వేయగలుగుతున్నాడు. అతడు వికెట్‌ టేకర్‌గా ఉంటూ చాలా పొదుపుగా బౌలింగ్‌ చేసేవాడు. అయితే, ఇప్పుడు తన అమ్ముల పొదిలో మరో అస్త్రాన్ని జోడించాలని నిర్ణయించుకున్నాడు. మధ్య ఓవర్లలో పరుగుల్ని నియంత్రించాలనుకుంటున్నాడు" అని పాండే వివరించారు.

ఇదీ చదవండి: Shikhar Dhawan: 'కెప్టెన్సీని గొప్పగా భావిస్తున్నా'

కుల్‌దీప్‌ ఇంకా మ్యాచ్‌ విన్నరే అని, ఇటీవల సరైన అవకాశాలు రాకపోవడం వల్లే అతడి ఆత్మవిశ్వాసం లోపించిందని చిన్ననాటి కోచ్‌ అభిప్రాయపడ్డాడు. 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో ఈ స్పిన్‌ స్పెషలిస్టు ఐదు వికెట్ల ప్రదర్శన చేసినా.. గత పర్యటనలో సగం మంది ఆటగాళ్లు గాయాలబారిన పడినా.. ఒక్క టెస్టులోనూ అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశాడు. అలాగే స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల్లో అతడిని ఆడించి ఉంటే 30 వికెట్లు తీసేవాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఐపీఎల్‌లోనూ అతడిని రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం చేశారని, ఈ మాట అనాలని లేకున్నా.. జట్టు యాజమాన్యం అతడిపై "సవతి తల్లి ప్రేమ" చూపిస్తుందనే అభిప్రాయం కొన్నిసార్లు కలుగుతుందని పాండే పేర్కొన్నారు. కుల్‌దీప్‌ గత రెండేళ్లుగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ఆడుతున్నాడు. గతేడాది ఐదు మ్యాచ్‌ల్లో ఒకే వికెట్‌ తీసిన అతడు ఈసారి తొలి భాగంలో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో లంక పర్యటనలో ఏ మేరకు రాణిస్తాడో వేచిచూడాలి.

ఇదీ చదవండి: 'అది మా నాన్న కల.. ఆయన ఉంటే బాగుండు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.