ETV Bharat / sports

రెండో వన్డే: కోహ్లీ మైలురాయి.. ఆసీస్ ఘనతలు - kohli reached 22 thousand runs in second odi

ఆదివారం సిడ్నీలో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా పలు ఘనతలు సాధించింది. మరోవైపు టీమ్​ఇండియా సారథి కోహ్లీ కూడా ఓ మైలురాయిని అందుకున్నాడు. అవేంటో చూద్దాం.

kohli
కోహ్లీ
author img

By

Published : Nov 29, 2020, 6:58 PM IST

సిడ్నీ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమ్​ఇండియా సారథి కోహ్లీ ఖాతాలోకి మరో మైలురాయి వచ్చి చేరింది. ఈ పోరులో 86పరుగులు చేసిన విరాట్​.. అంతర్జాతీయ కెరీర్​లో 22వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎనిమిదో బ్యాట్స్​మన్​గా నిలిచాడు. కెరీర్​ మొత్తం మీద 418 మ్యాచులు ఆడగా 462 ఇన్నింగ్స్​లో ఈ మార్క్​ను అందుకున్నాడు. కెరీర్​లో 664 మ్యాచులు ఆడిన సచిన్​ (34,357), కుమార్​ సంగక్కర(28,016)పరుగులు చేశారు.

తక్కువ ఇన్నింగ్స్​ల్లోనే 2వేల పరుగులు

ఈ పోరుతో ఆస్ట్రేలియాపై తక్కువ ఇన్నింగ్స్​ల్లోనే(40) 2వేల పరుగులు చేసిన ఆటగాడిన నిలిచి దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​ రికార్డును సమం చేశాడు సారథి కోహ్లీ. అయితే ఈ జాబితాలో రోహిత్​ శర్మ(37) అగ్రస్థానంలో ఉన్నాడు.

kohli
22వేల పరుగులు కోహ్లీ

భారత్​పై వరుసగా మూడు సెంచరీలు

ఈ సిరీస్​లో భాగంగా రెండు వన్డేల్లోనూ ​స్మిత్​ 62 బంతుల్లోనే వరుసగా రెండు సెంచరీలు చేశాడు. అంతకంటే ముందు బెంగళూరులో జరిగిన మ్యాచ్​లోనూ టీమ్​ఇండియాపై శతకం చేశాడు. దీంతో వన్డేల్లో భారత్​పై వరుసగా మూడు సెంచరీలు చేసిన ఆటగాళ్లలో జహీర్​ అబ్బాస్​ (1982-83), నాజిర్ జం​షెడ్​ (2012-13), క్వింటన్​ డికాక్​ (2013) సరసన స్మిత్ చేరాడు.

smith
స్మిత్​

అతి వేగంగా సెంచరీలు చేసిన ఆసీస్​ ఆటగాళ్లు

2007లో దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో 66బంతుల్లో హైడెన్​ సెంచరీ కొట్టాడు.

2015లో సిడ్నీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో గ్లెన్​ మాక్స్​వెల్​ 51 బంతుల్లోనే శతకం బాదాడు.

2013లో బెంగళూరు వేదికగా భారత్​తో జరిగిన పోరులో జేమ్స్​ ఫాల్క్​నర్​ 57బంతుల్లో సెంచరీ చేశాడు.

2020 సిడ్నీ వేదికగా జరుగుతోన్న సిరీస్​లో తొలి రెండు వన్డేల్లోనూ 62 బంతుల్లో చెరో శతకం బాదాడు స్మిత్​.

సెంచరీ భాగస్వామ్యం

ఈ పోరులో అరోన్​ ఫించ్​, వార్నర్ ఓపెనింగ్​ భాగస్వామ్యం ​142పరుగులు చేసింది. దీంతో వీరి జోడి 12సార్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసినట్లైంది. ఫలితంగా అంతకముందు సచిన్​, వీరేంద్ర సెహ్వాగ్​ జోడి చేసిన 12 సార్లు సెంచరీ భాగస్వామ్యాం రికార్డును సమం చేసింది. కాగా, సచిన్​ గంగూలీ అత్యధికంగా 21సార్లు శతక భాగస్వామ్యం నమోదు చేశారు.

warner
వార్నర్​ ఫించ్​

ఒకే మ్యాచ్​లో ఐదుగురు బ్యాట్స్​మెన్స్​ అర్ధ సెంచరీ

ఈ పోరులో వరుసగా ఐదుగురు బ్యాట్స్​మెన్స్​(వార్నర్​, అరోన్​ ఫించ్​, స్టీవ్​ స్మిత్​, మార్నస్​ లుబుషేన్​​, గ్లెన్​ మ్యాక్స్​వెల్)​ అర్ధ శతకంతో మెరిశారు. అంతకముందు 2013లో జైపుర్​ వేదికగా జరిగిన మ్యాచ్​లోనూ ఐదుగురు ఆసీస్ బ్యాట్స్​మెన్స్​ హాఫ్​ సెంచరీలను బాదారు. ఆసీస్​ జట్టు చరిత్రలో ఇలా జరగడం ఇది రెండోసారి. ​

five half centuries
రెండో వన్డేలో ఐదు అర్ధసెంచరీలు

అత్యధిక స్కోరు...

రెండో వన్డేలో భారత్​పై 389 పరుగుల భారీ స్కోరు చేసింది ఆసీస్. ఇదే భారత్​పై ఆసీస్​ అత్యధిక స్కోరు. అంతకుముందు శుక్రవారం టీమ్​ఇండియాతో జరిగిన తొలి వన్డేలో 374/6 చేయగా.. 2003 ప్రపంచకప్​లో భారతజట్టుపై 359/2 చేసింది ఆస్ట్రేలియా. దీంతో 17ఏళ్ల రికార్డును తొలి వన్డేతో బద్దలు కొట్టింది.

record
17ఏళ్ల రికార్డు బద్దలు

ఇదీ చూడండి : తొలి వన్డే: ఆసీస్​ ఘనతలు.. భారత్​ చెత్త రికార్డులివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.