బాక్సింగ్‌డే టెస్టు విజయంతో జోష్ మీదున్న టీమ్ఇండియా.. మూడో టెస్టుకు పలు మార్పులు చేయబోతుంది. యార్కర్ల స్పెషలిస్ట్ టి.నటరాజన్ ఈ మ్యాచ్‌తోనే టెస్టు అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. గాయంతో తప్పుకున్న పేసర్ ఉమేశ్ యాదవ్ స్థానంలో అతడు బరిలోకి దిగుతాడు.
జనవరి 7న జరిగే మూడో టెస్టు కోసం ఇప్పటికే సిడ్నీలో ఉన్న రోహిత్.. క్వారంటైన్ గడువు ముగించుకుని జట్టుతో కలిశాడు. ఓపెనింగ్‌లో తడబడుతున్న మయాంక్ అగర్వాల్‌ను పక్కనపెట్టి హిట్‌మ్యాన్‌కు చోటు కల్పించనున్నారు. సిరీస్‌లో అంతగా ఆకట్టుకోని హనుమ విహారి బదులు కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకోవచ్చని క్రికెట్ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: ఒక్క టెస్టు మ్యాచ్.. మూడు ఘనతలు