ETV Bharat / sports

మెల్​బోర్న్​లో మూడో టెస్టు.. మరింత మంది ప్రేక్షకులు!

author img

By

Published : Dec 26, 2020, 5:25 PM IST

సిడ్నీలో మూడో టెస్టు జరగడం సందేహంగా కనిపిస్తోంది. ఒకవేళ దానిని మెల్​బోర్న్​లో నిర్వహిస్తే స్టేడియంలో మరింత మంది ప్రేక్షకులు వచ్చే అవకాశముంది.

MCG may witness spectator surge if 3rd Test is shifted from Sydney
మెల్​బోర్న్​లో మూడో టెస్టు.. మరింత మంది ప్రేక్షకులు!

భారత్​, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు వేదిక మెల్​బోర్న్​కు తరలిస్తే.. స్టేడియం​లో మరింత మంది ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉందని ఎంసీజీ అధ్యక్షుడు స్టువర్ట్ ఫాక్స్​ చెప్పారు. మూడో టెస్టు సిడ్నీలోనే జరగడంపై ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది.

సిడ్నీలో కొవిడ్​ ఉద్ధృతి అధికంగా ఉండటం వల్ల తమ రాష్ట్రానికి వచ్చేవారు తప్పనిసరిగా స్వీయనిర్బంధంలోకి వెళ్లాలని క్వీన్స్​లాండ్ ఆంక్షలు విధించింది. సిడ్నీలో మూడో టెస్టు జరిగితే భారత ఆటగాళ్లకూ ఈ నిబంధన వర్తిస్తుంది.

ప్రస్తుతం రెండో టెస్టు జరుగుతున్న మెల్​బోర్న్​లో 30 వేల మంది ప్రేక్షకులకు అనుమతిస్తున్నారు. మూడో మ్యాచ్​ ఇక్కడే జరిగితే.. మరింత మంది వీక్షకులను అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని ఫాక్స్​ అన్నారు. తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు.

ఇదీ చూడండి: తొలి రోజు: ఆసీస్​ 195 ఆలౌట్- 36/1 వద్ద భారత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.