ETV Bharat / sports

'టీమ్​ఇండియాకు ధోనీలాంటి నైపుణ్యాలు అవసరం'

ప్రస్తుత భారత క్రికెట్​ జట్టులో మాజీ సారథి ధోనీ లోటు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైఖేల్​​ హోల్డింగ్​. భారీ ఛేదనలో ధోనీ ప్రదర్శించే వ్యూహాలు ప్రస్తుత జట్టుకు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.

India missing skill and character of Dhoni said by west indies player  Holding
'టీమ్​ఇండియాకు ధోనీలాంటి నైపుణ్యాలు అవసరం'
author img

By

Published : Nov 28, 2020, 9:14 PM IST

అదిరిపోయే బ్యాటింగ్​ లైన్​ ఉన్నప్పటికీ.. భారత జట్టులో ధోనీ నైపుణ్యం, వ్యక్తిత్వాన్ని మిస్​ అవుతున్నామని వెస్టిండీస్​ దిగ్గజ క్రికెటర్​​ మైఖేల్​​ హోల్డింగ్ అన్నారు. భారీ లక్ష్య ఛేదనలో మహీ ప్రదర్శించే వ్యూహాలను టీమ్​ఇండియా కోల్పోయిందని అన్నారు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో ఓటమి పాలైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు హోల్డింగ్​.

"మహేంద్ర సింగ్​ ధోనీ లేని లోటు ప్రస్తుత భారత క్రికెట్​ జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. భారీ పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం జట్టుకు భారంగా మారుతోంది. బ్యాటింగ్​ ఆర్డర్​ దారితప్పుతున్న క్రమంలో ధోనీ రంగంలోకి దిగి, మొత్తం పరిస్థితిని తన అదుపులోకి తెచ్చుకునేవాడు. ధోనీ ఉన్న రోజుల్లో భారత్​ చక్కగా ఆడింది. ప్రస్తుత జట్టు బ్యాటింగ్​ లైనప్​లో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. హార్దిక్​ పాండ్యా చక్కగా ఆడాడు. కానీ, ఆ జట్టుకు ధోనీలాంటి ఆటగాడు కావాల్సి ఉంది. ధోని స్థాయి నైపుణ్యాలు మాత్రమే కాదు, అతని లాంటి వ్యక్తిత్వం అవసరం."

--మైఖేల్ హోల్డింగ్, వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్.

ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆసీస్​ చేతిలో 67 పరుగుల తేడాతో ఓటమిపాలైంది టీమ్​ఇండియా. కంగారూ జట్టు విజయంలో ఫించ్(114), స్మిత్(105) కీలక పాత్ర పోషించారు. దీంతో మూడు వన్డేల సిరీస్​లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

ఇదీ చూడండి:రెండో వన్డే ముంగిట ఆసీస్​కు ఎదురుదెబ్బ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.