కాన్బెర్రాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 302 పరుగులు సాధించింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య(92*), సారథి కోహ్లీ(63), జడేజా(66) అర్ధశతకాలతో మెరిశారు. మిగతా బ్యాట్స్‌మన్ నామమాత్రపు పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో అగర్ 2, జంపా, హెజిల్వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ తీశారు.
సచిన్ రికార్డు బద్దలు
ఈ పోరులో టీమ్ఇండియా సారథి కోహ్లీ(63).. దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ రికార్డును బద్దలకొట్టాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12వేల పరుగులు(242 ఇన్నింగ్స్‌ల్లో) పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ తర్వాత సచిన్ (300 ఇన్నింగ్స్‌లు), పాంటింగ్(314), కుమార సంగక్కర(336), సనత్ జయసూర్య(379), మహేల జయవర్ధనే(399) ఉన్నారు.
నాలుగు సార్లు అతడి చేతికే
ఈ మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన టీమ్ఇండియా సారథి కోహ్లీని ఆసీస్ ఫాస్ట్ బౌలర్ హెజిల్వుడ్ కళ్లెం వేశాడు. అయితే ఈ సిరీలోని తొలి రెండు వన్డేలు సహ గత సిరీస్‌లో చివరి వన్డేలోనూ హెజిల్వుడ్ చేతికే విరాట్ చిక్కడం విశేషం.
-
The decision to review was an inspired one! ☝
— cricket.com.au (@cricketcomau) December 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Hazlewood gets Kohli for the third time this series! #OhWhatAFeeling@Toyota_Aus | #AUSvIND pic.twitter.com/9gRYWxHPxY
">The decision to review was an inspired one! ☝
— cricket.com.au (@cricketcomau) December 2, 2020
Hazlewood gets Kohli for the third time this series! #OhWhatAFeeling@Toyota_Aus | #AUSvIND pic.twitter.com/9gRYWxHPxYThe decision to review was an inspired one! ☝
— cricket.com.au (@cricketcomau) December 2, 2020
Hazlewood gets Kohli for the third time this series! #OhWhatAFeeling@Toyota_Aus | #AUSvIND pic.twitter.com/9gRYWxHPxY
ఇదీ చూడండి : సచిన్‌ను అధిగమించిన కోహ్లీ- వన్డేల్లో సరికొత్త రికార్డు