తొలి టెస్టులో జీర్ణించుకోలేని ఓటమి, అంతేగాక కోహ్లీ, షమి జట్టుకు దూరమవ్వడం.. ఇలాంటి ప్రతికూలాంశాలతో ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో భారత్ ప్రదర్శన ఎలా ఉంటుందోనని సందేహాలు మొదలయ్యాయి. కానీ కోహ్లీ గైర్హాజరీలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న అజింక్య రహానె జట్టును గొప్పగా నడిపిస్తున్నాడు. బాక్సింగ్ డే టెస్టులో మొదటి రోజు ఎత్తులతో ప్రత్యర్థులను బోల్తాకొట్టించిన అతడు ఆదివారం శతకం సాధించి టీమ్ఇండియాను 82 పరుగుల ఆధిక్యంలో నిలిపాడు. కాగా, అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న జింక్స్‌పై ప్రశంసలు జల్లు కురుస్తోంది.
"మనకి మరో గొప్ప రోజు. జింక్స్ టాప్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. అసలైన టెస్టు క్రికెట్ ఉత్తమంగా ఉంటుంది." --విరాట్ కోహ్లీ
"రహానె కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. మైదానంలో ప్రశాంతత, ఫీల్డర్లను తెలివిగా మోహరించడం తన వ్యక్తిత్వాన్ని చాటిచెబుతున్నాయి. జడేజా గొప్పగా ఆడుతున్నాడు. లోయర్‌ఆర్డర్‌లో భారత్‌కు బలంగా మారాడు. అంతేగాక శుభ్‌మన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. మేం మంచి ఆధిక్యాన్ని ఆశిస్తున్నాం." --యువరాజ్ సింగ్
"రహానె గొప్పగా ఆడాడు. క్లాస్ అనేది శాశ్వతం. అడిలైడ్ చేదు జ్ఞాపకాలను తుడిచి ఉన్నత శిఖరాలను అందుకునేలా భారత్ ప్రదర్శన సాగుతోంది." --బిషన్‌సింగ్ బేడీ
"ఇది విలక్షణమైన శతకం. రహానె ముందుండి జట్టును గొప్పగా నడిపిస్తున్నాడు. ఈ పిచ్‌పై బ్యాటింగ్ అంత సులువు కాదు. 60-70 పరుగులు సాధించినా బ్యాట్స్‌మెన్ కుదురుకున్నాడని చెప్పలేని వికెట్ ఇది."--సునిల్ గావస్కర్
"అద్భుత శతకం. రహానె సంకల్పంతో కళాత్మకంగా ఆడాడు." --వీరేంద్ర సెహ్వాగ్
"రహానె గొప్ప కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. తన ప్రతిభను ప్రదర్శించాడు. గిల్, పంత్, జడేజా ఇన్నింగ్స్‌లు చాలా విలువైనవి. మూడో రోజు ఆట చాలా కీలకం." --వీవీఎస్ లక్ష్మణ్
"కుడోస్.. రహానె! తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను దెబ్బతీశాడు. తొలి రెండు సెషన్‌లో నిలకడగా ఆడుతూ, ఆఖరి సెషన్‌లో దూకుడు పెంచాడు. గొప్ప ప్రదర్శన చేశాడు."--మహ్మద్ కైఫ్
"అజింక్య రహానె.. మీ గురించి ఏం చెప్పాలి? మజా ఆగయా! కెప్టెన్సీతో అదరగొట్టాడు. ఇప్పుడు అద్భుత శతకంతో మెరిశాడు. అతడి ఉత్తమ శతకాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. అంతేగాక విదేశాల్లో భారత కెప్టెన్లు సాధించిన శతకాల్లో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు." --ఆకాశ్ చోప్రా
"రహానె జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. గొప్ప శతకం సాధించాడు." --హర్భజన్ సింగ్
"నాయకత్వ బాధ్యతలు అతడి ఆటను మరింత మెరుగుపరుస్తున్నాయి." --ప్రజ్ఞాన్ ఓజా
"దృఢ సంకల్పంతో, పరిస్థితులపై దృష్టిసారిస్తూ బ్యాటింగ్ చేసిన రహానె ఇన్నింగ్స్‌ను ఎంతో ఆస్వాదించా. అద్భుతమైన శతకం సాధించాడు."--దినేశ్ కార్తీక్
"కొన్ని ప్రదర్శనలు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. అజింక్య రహానె అలాంటే ప్రదర్శనే చేశాడు. ఈ ఇన్నింగ్స్ అతడికి ఎంతో గర్వకారణం." --హర్షా భోగ్లే
"గొప్ప శతకం. ప్రశాంతంగా ఆడాడు. కీలక సమయంలో నాణ్యమైన ఇన్నింగ్స్‌తో సత్తాచాటాడు." --సంజయ్ మంజ్రేకర్
ఇదీ చూడండి:బాక్సింగ్ డే టెస్టు: ఈసారి ఆధిపత్యం ఎవరిదో?