ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో చిత్తుగా ఓడిన తర్వాత జట్టులో సమూల మార్పులు చేసేందుకు టీమ్ఇండియా సిద్ధమవుతోంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల కోసం సాహా, పృథ్వీషాను పక్కన పెట్టాలనే ఆలోచనలో ఉంది. బదులుగా శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లకు అవకాశం ఇవ్వనున్నారట.
బ్యాటింగ్‌లో నిరాశపరచడం, ఫీల్డింగ్‌లో తప్పిదాలే షాను తప్పించడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. అతడి స్థానంలో గిల్‌ను ఓపెనర్‌గా దింపనున్నారు. వికెట్ కీపర్‌గా పంత్‌కు స్థానం కల్పించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే సాహా, పంత్‌ల చిక్కుముడికి ఓ లెక్క ఉందని చెప్పాడు మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.
"ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో పంత్ మేనేజ్మెంట్కు తొలి ప్రాధాన్యత. గత కొన్నాళ్లుగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన పంత్, పింక్‌బాల్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. మిగిలిన మూడు మ్యాచ్‌లకు అతడ్ని తీసుకోవడం సరైన నిర్ణయమే"
--ఎమ్మెస్కే ప్రసాద్, మాజీ చీఫ్ సెలక్టర్
వీళ్లు కూడా..
రెండో టెస్టు నుంచి జట్టుకు దూరమైన కెప్టెన్ కోహ్లీ, పేసర్ షమిలకు బదులుగా కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ వచ్చే అవకాశముంది.
ఆర్డర్లో మార్పు..
విరాట్ గైర్హాజరీతో బ్యాటింగ్ లైనప్లోనూ పలు మార్పులు జరగనున్నాయి. హనుమ విహారిని ఐదో స్థానంలోకి మార్చితే బాగుంటుందని ఎమ్మెస్కే అభిప్రాయపడ్డారు.