గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మను ఆదివారం బీసీసీఐ వైద్య బృందం పరీక్షించనుంది. అతనికి గాయం తగ్గిందా లేదా? ఇంకొంత విశ్రాంతి అవసరమా?అన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. రోహిత్‌కు గాయం తగ్గితే వికెట్ల మధ్య పరిగెత్తటం కష్టమేమీ కాదని అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్‌ను జట్టులోకి తీసుకోకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
అక్టోబరు 18న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌కు గాయమైంది. ఆ తర్వాత బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ బరిలోకి దిగలేదు. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది ముంబయి.
లీగ్ అవ్వగానే దుబాయ్ నుంచి భారత జట్టు ఆస్ట్రేలియా వెళ్లనుంది. కోచ్, సిబ్బందితోపాటు, టెస్టు ఆటగాళ్లు పుజారా, విహారి త్వరలోనే దుబాయ్ చేరుకోనున్నారు.