ETV Bharat / sports

'డే/నైట్ మ్యాచ్​ల్లో బ్యాటింగ్​ కష్టమే' - భారత్Xఆస్ట్రేలియా సిరీస్​

డే/నైట్​ మ్యాచ్​ల్లో స్పిన్​ బౌలింగ్​లో బ్యాటింగ్​ చేయడం కష్టమా? బ్యాట్స్​మెన్​ వాళ్ల బంతుల్ని సరిగా అర్థం చేసుకోలేరా? లాంటి అంశాల గురించి మాట్లాడిన కుల్దీప్​.. వాటికి సమధానాలు చెప్పాడు. ఈనెల 17న అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య గులాబీ బంతి టెస్టు జరగనుంది.

Batsmen often find spinners difficult to read under lights says Kuldeep
'ఆ సమయంలో బ్యాట్స్​మన్​ స్పిన్​ బంతిని పసిగట్టలేడు'
author img

By

Published : Dec 13, 2020, 8:42 PM IST

ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టు జరగనున్న నేపథ్యంలో భారత స్పిన్నర్ కుల్​దీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ తరహా​ మ్యాచ్​ల్లో బ్యాట్స్​మెన్,​ స్పిన్​ బౌలింగ్​ను అర్థం చేసుకోవడం కష్టమని పేర్కొన్నాడు. ఈ పోరు కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.

"రాత్రి వేళలో స్పిన్నర్ల బౌలింగ్ శైలిని బ్యాట్స్​మెన్​ పసిగట్టలేరు. ఎందుకంటే వాళ్లు భిన్నంగా బంతులు విసిరేందుకు ప్రయత్నిస్తారు. దానిని బ్యాట్స్​మెన్​ అంత త్వరగా కనిపెట్టలేకపోవచ్చు. దీని వల్ల బౌలర్లకే మేలు. ఇతర దేశాల్లో పింక్​ బాల్​తో​ ఆడిన అనుభవం నాకు లేదు. అందుకే ఈ టెస్టులో ఎలా ఆడతానో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను"

-కుల్​దీప్​ యాదవ్, భారత స్పిన్నర్

ఆస్ట్రేలియాలో స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపలేరనడం సరికాదని కుల్​దీప్​ అన్నాడు. పరిస్థితులను అర్థం చేసుకోగలిగితే వారు కూడా మెరుగైన ప్రదర్శన చేస్తారని తెలిపాడు. టీ20లతో పోలిస్తే టెస్టుల్లో వికెట్లు కోసం చాలా ఓపికగా ఉండాలని చెప్పాడు.

గత పర్యటనలో స్మిత్, వార్నర్​ లేనంత మాత్రాన సిరీస్​ గెలిచేమనడం సరికాదని కుల్​దీప్ తెలిపాడు. టెస్టు జట్టులో ఎప్పుడు అవకాశం లభించినా సరే పూర్తిస్థాయిలో ప్రదర్శన చేసి, జట్టును గెలిపించేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. అదే తనకు సంతోషాన్నిస్తుందని అన్నాడు.

ఇదీ చదవండి:జనవరి నుంచి దేశవాళీ పోరు.. మొదటగా ఆ టోర్నీనే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.