ETV Bharat / sports

'అదృష్టం వల్లే రహానె సెంచరీ చేశాడు' - అజింక్య రహానే

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టులో టీమ్​ఇండియా కెప్టెన్​ అజింక్యా రహానె అజేయ శతకంతో చెలరేగాడు. అయితే.. అతడు సెంచరీ చేరే కంటే ముందే ఐదు సార్లు ఔటయ్యే వాడని ​అన్నాడు ఆస్ట్రేలియా పేసర్​ మిచెల్​ స్టార్క్. అదృష్టం వల్ల అతడు రాణించగలిగాడని చెప్పాడు.

AUS vs IND: Could have dismissed Rahane five times before his hundred, says Starc
అదృష్టం వల్ల రహానె రాణించగలిగాడు:స్టార్క్​
author img

By

Published : Dec 27, 2020, 7:41 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు కెప్టెన్​ అజింక్యా రహానే(104) అదరగొట్టాడు. అజేయ శతకంతో చెలరేగి ఆసీస్​ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. అయితే.. రహానె శతకం చేరడం కంటే ముందే ఐదు సార్లు ఔట్​ అయ్యేవాడని అన్నాడు ఆసీస్​ పేసర్​ మిచెల్​ స్టార్క్​. అదృష్టం ఈసారి జింక్స్​ వైపే ఉందని వ్యాఖ్యానించాడు. మ్యాచ్​ ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో అతడు మాట్లాడాడు.

"రహానె చక్కగా ఆడాడు. అతను శతకం సాధించే కంటే ముందు ఐదు సార్లు ఔటై ఉండేవాడు. కానీ, అదృష్టం అతడి వైపు ఉండడం వల్ల వంద పరుగులు చేయగలిగాడు. ఈ రోజు పూర్తయ్యే సరికి మెల్​బోర్న్​ క్రికెట్​ మైదానం చక్కగా తయారైంది. రెండో ఇన్నింగ్స్​లో మేం బాగా ఆడగలుగుతాం."

-స్టార్క్​, ఆసీస్​ పేసర్​.

స్టార్క్​ ఓవర్లో రహానెను పెవిలియన్​కు చేర్చే అవకాశం వచ్చినా క్యాచ్​ చేజార్చుకున్నారు ఆసీస్​ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్​, హెడ్​. ​ఫలితంగా కంగారు జట్టు భారీ మూల్యమే చెల్లించక తప్పలేదు. కాగా.. తొలిరోజు ఆటముగిసే సమయానికి 82 పరగుల ఆధిక్యంలో కొనసాగుతోంది భారత్​.

స్టార్క్@250

రిషబ్​ పంత్​ను పెవిలియన్​కు చేర్చి టెస్టుల్లో 250 వికెట్లు తీసిన బౌలర్​గా స్టార్క్ ఘనత సాధించాడు. అతి తక్కువ బంతుల్లోనే అతడు ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ మార్క్​ను అందుకోవడానికి 11,976 బంతులు తీసుకున్నాడు స్టార్క్.

ఇదీ చూడండి:రహానె శతకంపై కోహ్లీ ఏమన్నాడంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.