India Test Wins In South Africa: భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికా పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో 1-1 టీ20 సిరీస్ సమం కాగా, 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను పట్టేసింది టీమ్ఇండియా. ఇక రీసెంట్గా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కూడా 1-1తో ముగించి సిరీస్‌ను డ్రా చేసుకుంది. అయితే గత మూడు దశాబ్దాలుగా సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గని టీమ్ఇండియా, 5 మ్యాచ్‌ల్లో విజయం అందుకుంది. మరి ఆ విజయాలు ఎప్పుడెప్పుడు ఏ వేదికలో నమోదయ్యాయో తెలుసుకుందాం.
భారత్ vs సౌతాఫ్రికా- జొహెన్నస్‌బర్గ్, 2006
- 2006లో టీమ్ఇండియా, సౌతాఫ్రికాలో పర్యటించినప్పుడు టెస్టుల్లో సఫారీ గడ్డపై తొలి విజయాన్ని రుచి చూసింది. ఈ మ్యాచ్‌లో భారత్ వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో (249-10, 236-10) స్కోర్లు చేసింది. ఇక ఆతిథ్య సౌకాఫ్రికా (84-10, 278-10) స్కోర్లకు పరిమితమైంది. దీంతో భారత్ 123 పరుగుల విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో మాజీ పేసర్ శ్రీశాంత్ (5-40, 3-59) ఎనిమిది వికెట్లతో అదరగొట్టాడు.
భారత్ vs సౌతాఫ్రికా- డర్బన్, 2010
- సౌతాఫ్రికా గడ్డపై 2006లో టెస్టుల్లో తొలి విజయం అందుకున్న టీమ్ఇండియాకు రెండో విక్టరీ కొట్టేందుకు దాదాపు నాలుగేళ్లు పట్టింది. 2010లో టీమ్ఇండియా రెండో మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల తర్వాత సౌతాఫ్రికా ముందు 303 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది టీమ్ఇండియా. ఛేదనలో తడబడ్డ సఫారీ జట్టు 215 పరుగులకే ఆలౌటైంది. ఆ మ్యాచ్‌లో (38,96)స్కోర్లు చేసిన వీవీఎస్ లక్ష్మణ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
భారత్ vs సౌతాఫ్రికా- జొహెన్నస్‌బర్గ్, 2018
- దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టీమ్ఇండియా మూడో గెలుపును నమోదు చేసింది. 2018లో జొహెన్నస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 255 పరుగులను ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా 63 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ ఏకంగా ఎనిమిది వికెట్లతో చెలరేగాడు.
భారత్ vs సౌతాఫ్రికా- జొహెన్నస్‌బర్గ్, 2021
- 2021లో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా 113 పరుగుల తేడాతో నెగ్గి, సౌతాఫ్రికాలో నాలుగో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (123) సెంచరీతో అదరగొట్టగా, మహ్మద్ షమీ ఎనిమిది వికెట్లతో రాణించాడు. కానీ, ఈ సిరీన్‌ను 2-1తో సౌతాఫ్రికా గెలుచుకుంది.
భారత్ vs సౌతాఫ్రికా- కేప్‌టౌన్, 2024
- తాజాగా ముగిసిన పర్యటనలో భారత్, సఫారీ గడ్డపై ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఇదే పర్యటనలో తొలి మ్యాచ్‌లో ఓడిన టీమ్ఇండియా రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేసి భారత్‌కు 79 స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం టీమ్ఇండియా 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
-
Starting the New Year with a historic Test win at Newlands 👌👌
— BCCI (@BCCI) January 5, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
📽️ Relive all the moments here 🔽#TeamIndia | #SAvIND pic.twitter.com/xbpMGBXjxR
">Starting the New Year with a historic Test win at Newlands 👌👌
— BCCI (@BCCI) January 5, 2024
📽️ Relive all the moments here 🔽#TeamIndia | #SAvIND pic.twitter.com/xbpMGBXjxRStarting the New Year with a historic Test win at Newlands 👌👌
— BCCI (@BCCI) January 5, 2024
📽️ Relive all the moments here 🔽#TeamIndia | #SAvIND pic.twitter.com/xbpMGBXjxR
-
ఇక సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ నెగ్గడం మాత్రం టీమ్ఇండియాకు మూడు దశాబ్దాలుగా కలగానే ఉంది. ప్రస్తుతం అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న టీమ్ఇండియా ఈ పర్యటనలో సిరీస్ తప్పక గెలుస్తుందని భావించారు అభిమానులు. కానీ, అది నెరవేరలేదు. దీం
'భారత్ పిచ్‌లపై మాట్లాడే వారు నోరు మూసుకోవాలి- మా వద్ద బంతి తిరిగితే ఒప్పుకోరా?'తో సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవడం కోసం మరికొంత కాలం ఎదురు చూడాల్సిందే.
ఒకటిన్నర రోజుల్లోనే మ్యాచ్ కంప్లీట్- సెకండ్ టెస్ట్‌లో భారత్ విజయం- సిరీస్ సమం