ETV Bharat / sports

టీ20ల్లో రోహిత్, విరాట్ రీ ఎంట్రీ- అఫ్గాన్ సిరీస్​కు జట్టు ప్రకటన - భారత్ అఫ్గాన్ 2024

India Squad For Afghanistan T20 Series: స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో టీమ్ఇండియా మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. జవనరి 11 నుంచి ప్రారంభంకానున్న ఈ సిరీస్‌ కోసం సెలక్షన్‌ కమిటీ జట్టును ఎంపిక చేసింది.

India Squad For Afghanistan T20 Series
India Squad For Afghanistan T20 Series
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2024, 7:37 PM IST

Updated : Jan 7, 2024, 8:43 PM IST

India Squad For Afghanistan T20 Series: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20ల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్​తో జరగనున్న టీ20 సిరీస్​కు బీసీసీఐ ఆదివారం భారత్ జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్​ రోహిత్​కు తిరిగి టీ20 పగ్గాలు అప్పగిస్తూ, విరాట్​ సహా 16మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.

14 నెలల తర్వాత: కెప్టెన్ రోహిత్, బ్యాటర్ విరాట్ కోహ్లీ దాదాపు 14 నెలల తర్వాత పొట్టి ఫార్మాట్​లో బరిలోకి దిగనున్నారు. వీరిద్దరూ 2022 టీ20 వరల్డ్​కప్ సెమీస్ తర్వాత ఈ ఫార్మాట్​కు దూరంగా ఉంటూ వచ్చారు. కాగా, 2024 వరల్డ్​కప్ సమీపిస్తున్న నేపథ్యంలో వీళ్లు టీ20 ఫార్మాట్​లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల బీసీసీఐకి తెలిపినట్లు సమాచారం. కొన్ని రోజులుగా రోహిత్, విరాట్ టీ20 ఫ్యూచర్​పై ఉన్న అనుమానాలన్నీ ఈ సిరీస్​తో తీరిపోనున్నాయి.

భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్​మన్ గిల్, యశస్వీ జైశ్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్​దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ ఖాన్

Afghanistan Squad For India Series: అఫ్గానిస్థాన్​ బోర్డు కూడా శనివారం జట్టును ప్రకటించింది. ఈ సిరీస్​తో జట్టులో స్టార్ ఆల్​రౌండర్ రషీద్ ఖాన్ టీ20ల్లో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ జట్టుకు ఇబ్రహీమ్ జోర్డాన్​కు కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

అఫ్గానిస్థాన్ జట్టు: ఇబ్రహీమ్ జోర్డాన్ (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, హజ్మతుల్లా జజాయ్, అలిఖిల్, రహ్మత్ షా, మహ్మద్ నబీ, జర్డాన్, ఓమర్జాయ్, అష్రఫ్, ముజీబ్ రహ్మన్, ఫారుకీ, మాలిక్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, సలీమ్, అహ్మద్, నబీ, రషీద్ ఖాన్.

అఫ్గానిస్థాన్​తో టీ20 షెడ్యుల్:

  • జనవరి 11 తొలి టీ20- మొహాలీ రాత్రి 7 గంటలకు
  • జనవరి 14 రెండో టీ20- ఇందౌర్‌ రాత్రి 7 గంటలకు
  • జనవరి 17 మూడో టీ20- బెంగళూరు రాత్రి 7 గంటలకు

టీ20 వరల్డ్​కప్​లో రోహిత్, విరాట్ ఉండాల్సిందే వాళ్లకు ఆ సత్తా ఉంది: గంగూలీ

టీ20 వరల్డ్​కప్​ జట్టులో రోహిత్ ఇన్, కోహ్లీ ఔట్​- కెప్టెన్​ ఛాన్స్ అతడికే!

Last Updated : Jan 7, 2024, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.