ETV Bharat / sports

విండీస్​తో టీమ్ఇండియా సిరీస్​.. అమెరికాలో మ్యాచ్​లు! - matches in america

IND Vs WI Series: మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచుల సిరీస్​ కోసం భారత క్రికెట్​ జట్టు వెస్టిండీస్​ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో చివరి రెండు టీ20 మ్యాచ్​లను అమెరికాలో ఆడనుంది. ఈ రెండు మ్యాచులు ఆగస్టు 6, 7 తేదీల్లో ఫ్లోరిడాలో జరగనున్నట్లు తెలుస్తోంది.

India set to play two T20Is vs WI in US
India set to play two T20Is vs WI in US
author img

By

Published : Mar 31, 2022, 10:39 PM IST

IND Vs WI Series: ఈ ఏడాది ఆగస్టు నెలలో వెస్టిండీస్‌తో భారత క్రికెట్​ జట్టు.. అమెరికాలో రెండు టీ20 మ్యాచ్​లు ఆడనుంది. మూడు వన్డేలు, ఐదు టీ20ల కోసం భారత జట్టు.. విండీస్ పర్యటనకు వెళ్లనుంది. వెస్టిండీస్​లో ఆరు మ్యాచ్​లు ఆడనుండగా, చివరి రెండు టీ20లు యూఎస్‌లో జరుగుతాయి. ఈ రెండు మ్యాచ్‌లను.. ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో నిర్వహించనుంది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. కాగా, ఈ సిరీస్.. జులై చివరి వారంలో ప్రారంభమై ఆగస్టు మొదటి వారంలో ముగియనుందని సమాచారం.

India Matches In US: ఫ్లోరిడాలోని లాడర్​హిల్​ స్టేడియం ఇప్పటికే ఆరు అంతర్జాతీయ మ్యాచ్​లకు ఆతిథ్యాన్నిచ్చింది. 2016, 2019 సంవత్సరాల్లో టీమ్​ఇండియా ఈ స్టేడియంలో నాలుగు మ్యాచ్​లు ఆడింది. టీమ్​ఇండియా పర్యటన షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని, ఆగస్టు 6, 7 తేదీల్లో రెండు మ్యాచ్​లు జరిగే అవకాశాలున్నాయని ఓ బీసీసీఐ అధికారి చెప్పారు.

ఇంగ్లండ్ నుంచి నేరుగా వెస్టిండీస్​కు: ఇంగ్లండ్ జట్టుతో పెండింగ్‌లో ఉన్న టెస్ట్ మ్యాచ్, ఆరు వన్డే మ్యాచ్​లు ఆడిన తర్వాత భారత్ జట్టు నేరుగా వెస్టిండీస్‌కు చేరుకుంటుంది. బీసీసీఐ త్వరలోనే ఇంగ్లండ్ టూర్‌తో పాటు కరీబియన్ టూర్‌కు సంబంధించిన జట్టును ప్రకటించనుంది. భారత్‌తో సిరీస్ పూర్తయిన తర్వాత, వెస్టిండీస్ ఆటగాళ్లు ఆగస్టు 29న ప్రారంభం కానున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్​లో పాల్గొంటారు.

ఇదీ చదవండి: పొవార్ స్థానంలో లక్ష్మణ్!.. అమ్మాయిల రాత మారేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.