ETV Bharat / sports

వరుణుడి ఆటంకం.. ఐదో టీ20 రద్దు.. సిరీస్ డ్రా

author img

By

Published : Jun 19, 2022, 9:52 PM IST

Updated : Jun 19, 2022, 10:43 PM IST

INDIA SA MATCH
INDIA SA MATCH

21:49 June 19

వరుణుడి ఆటంకం.. ఐదో టీ20 రద్దు.. సిరీస్ డ్రా

IND Vs SA Series Draw: అనుకున్నట్లే జరిగింది. భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్‌ నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్‌ వర్షార్పణమయ్యింది. దీంతో సిరీస్ 2-2తో డ్రా అయింది. చిన్నస్వామి స్టేడియంలో ఇంకా వర్షం పడుతుండడం వల్ల మ్యాచ్‌ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేసినట్లు బీసీసీఐ అధికారులు ప్రకటించారు.

టాస్‌ తర్వాత ఒక్క బంతి కూడా పడకముందే వర్షం మొదలైంది. ప్లేయర్లంతా డ్రెసింగ్‌ రూమ్‌లకే పరిమితమయ్యారు. వర్షం జోరుగా కురుస్తుండటం వల్ల మ్యాచ్‌ జరుగుతుందా లేదా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. వర్షం వల్ల మ్యాచ్​ 20 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైనందున.. 19 ఓవర్లకే ఆటను కుదించినట్లు అధికారులు ప్రకటించారు. వర్షం తగ్గిన తర్వాత భారత ఓపెనర్లు బ్యాటింగ్‌కు దిగారు. రెండు సిక్సర్లు బాది ఊపు మీద కనిపించిన ఇషాన్‌ (15)ను ఎంగిడి పెవిలియన్‌ చేర్చాడు. మరో ఓపెనర్ రుతురాజ్‌ (10)ని కూడా ఎంగిడియే ఔట్‌ చేశాడు. 3.3 ఓవర్ల ఆట పూర్తయిన అనంతరం మళ్లీ వర్షం ప్రారంభం అయింది. దీంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. అప్పటికి భారత్‌ స్కోరు 28/2గా ఉంది. మరి చేసేదేమి లేక బీసీసీఐ మ్యాచ్​ను రద్దు చేసింది.

ఇవీ చదవండి: 'ఫాదర్స్ డే'న కొడుకును పరిచయం చేసిన యువీ.. పేరేంటో తెలుసా?

'రాసిపెట్టుకోండి.. వచ్చేసారి రూ.లక్ష కోట్లు పక్కా'

Last Updated : Jun 19, 2022, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.