ETV Bharat / sports

ఆ రికార్డు సాధించిన ఒకే ఒక జట్టు టీమ్ఇండియా! - 2011 world cup

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్​లో ఆధిపత్యం చెలాయిస్తున్న భారత జట్టు.. ఏ దేశానికి సాధ్యం కాని ఘనతను సాధించింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటి? ఎప్పుడు సాధించింది?

India is the only country to win the 60, 50, 20 Over cricket World Cup
టీమ్​ఇండియా
author img

By

Published : May 25, 2021, 9:32 AM IST

ప్రపంచకప్​ గెలవాలనేది ప్రతి దేశ క్రికెట్ జట్టు కోరిక. అలాంటిది మూడు విభాగాల్లోనూ ఈ కప్​లను టీమ్​ఇండియా గెలుచుకుంది. 60, 50, 20 ఓవర్ల వరల్డ్​కప్​ల్లో విజేతగా నిలిచిన ఏకైక టీమ్​గా రికార్డు సృష్టించింది. అది ఇప్పటికీ మన పేరు మీదే ఉండటం విశేషం.

1983లో కపిల్​దేవ్​ నేతృత్వంలో వన్డే ప్రపంచకప్ ఆడిన భారత్.. డిఫెండింగ్ ఛాంపియన్​ వెస్డిండీస్​ను ఓడించి, విజేతగా నిలిచింది. ఈ టోర్నీ 60 ఓవర్ల విధానంలో సాగడం గమనార్హం.

2007లో ధోనీ కెప్టెన్సీలో తొలి టీ20 ప్రపంచకప్​ ఆడిన భారత్.. అంచనాల్ని తలకిందులు చేస్తూ కప్ ఎగరేసుకుపోయింది. ఫైనల్లో పాకిస్థాన్​ను ఓడించి, జగజ్జేతగా అవతరించింది.

2011లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్​లో ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించిన మెన్ ఇన్ బ్లూ.. అద్భుతంగా ఆడింది. ఫైనల్లో శ్రీలంకను ఓడించి, 28 తర్వాత మళ్లీ ప్రపంచకప్​ను ముద్దాడింది. దీంతో మూడు విభిన్న ప్రపంచకప్​లు గెలుచుకున్న ఏకైక జట్టుగా టీమ్​ఇండియా నిలిచింది.

ఇది చదవండి: సచిన్ బ్యాట్​తో పాక్ క్రికెటర్ ఫాస్టెస్ట్ సెంచరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.