ETV Bharat / sports

టీ20ల్లో పదిలం.. వన్డేల్లో మూడో ర్యాంకుకు భారత్​ - ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​లో మూడో స్థానంలో భారత్

ఐసీసీ టీ20, వన్డే టీమ్​ల వార్షిక ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. టీమ్​ఇండియా పొట్టి ఫార్మాట్​లో రెండో స్థానాన్ని నిలబెట్టుకోగా.. వన్డేల్లో మాత్రం ఒక స్థానాన్ని కోల్పోయి మూడో ర్యాంకులో నిలిచింది.

India 2nd in ICC T20 rankings, drop to 3rd in ODI chart after annual update
ఐసీసీ ర్యాంకింగ్స్​, టీ20ల్లో రెండో స్థానంలో భారత్, వన్డేల్లో మూడో స్థానం
author img

By

Published : May 3, 2021, 1:57 PM IST

ఐసీసీ టీ20, వన్డే జట్ల వార్షిక ర్యాంకింగ్​లను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). తాజా జాబితాలో పొట్టి ఫార్మాట్​లో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ విభాగంలో 277 పాయింట్లతో ఇంగ్లాండ్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. పాకిస్థాన్​తో సిరీస్​ను 1-1తో ముగించిన ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియాను 2-1తో ఓడించింది. దక్షిణాఫ్రికాపై 3-0 తేడాతో విజయకేతనం ఎగురవేసింది. దీంతో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది.

ఇదీ చదవండి: 'వాళ్లు ఇంకా ఐపీఎల్​లో ఆడటం ఆశ్చర్యంగా ఉంది'

తదుపరి స్థానంలో ఉన్న భారత్​కు, ఇంగ్లాండ్​కు మధ్య 5 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. కాగా, ర్యాంకింగ్స్​కు ముందు ఐదో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ప్రస్తుతం 263 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. వెస్టిండీస్, ఆసీస్, పాకిస్థాన్​, బంగ్లాదేశ్​తో సిరీస్​ విజయాలను నమోదు చేయడం కివీస్​కు కలిసొచ్చింది. మూడో స్థానంలో ఉన్న ఆసీస్​.. ఐదో స్థానానికి పడిపోయింది. శ్రీలంక, బంగ్లాదేశ్​ జట్లు ఒక్కొక్క స్థానాన్ని మెరుగుపరుచుకున్నాయి. వరుసగా 8, 9 స్థానాల్లో కొనసాగుతున్నాయి. విండీస్​ మాత్రం పదో స్థానానికి పడిపోయింది.

ఇదీ చదవండి: కోల్‌కతా ఆటగాళ్లకు కరోనా.. బెంగళూరుతో మ్యాచ్ వాయిదా

ఇక వన్డే వార్షిక ర్యాంకింగ్​ల్లో టీమ్​ఇండియా మూడో స్థానానికి పడిపోయింది. ఈ జాబితాలో కివీస్ జట్టు తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంతకుముందు అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్.. ప్రస్తుత జాబితాలో నాలుగో ర్యాంకుకు పడిపోయింది. ఇక నాలుగో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా రెండో స్థానాన్ని దక్కించుకుంది.

కొత్తగా వన్డే ర్యాంకింగ్​ల్లో నెదర్లాండ్స్​ జట్టు ప్రవేశించింది. ఇప్పటివరకు ఆ జట్టు నాలుగు వన్డేలు మాత్రమే ఆడింది. కొవిడ్ వల్ల మ్యాచ్​లు వాయిదా పడటం వల్ల ర్యాంకింగ్​ల్లో చోటు కల్పించింది. ప్రస్తుత జాబితాలో పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్ జట్లు పాత స్థానాల్లోనే ఉన్నాయి. ఆ టీమ్​ల ర్యాంకుల్లో మార్పులేమీ జరగలేదు. అఫ్గానిస్థాన్​ వన్డేల్లో 10, టీ20ల్లో 7వ స్థానంలో ఉండగా.. పాక్​ వన్డేల్లో 6, పొట్టి ఫార్మాట్​లో 4 స్థానాలను దక్కించుకుంది.

పాకిస్థాన్-జింబాబ్వే మధ్య జరుగుతున్న టెస్ట్​ సిరీస్​ ముగిశాక వార్షిక టెస్టు ర్యాంకింగ్స్​ను ప్రకటించనుంది ఐసీసీ.

ఇదీ చదవండి: ఫ్యాన్స్​ ఆందోళనతో ఫుట్​బాల్​ మ్యాచ్​ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.