ETV Bharat / sports

'ఇది కెప్టెన్సీనా? అలా చేసి ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లం'.. పాండ్యపై టీమ్ఇండియా ఫ్యాన్స్ ఫైర్

Ind vs Wi T20 : విండీస్​తో జరిగిన రెండో టీ20లో భారత్ ఓటమిపాలైంది. అయితే చివర్లో మ్యాచ్​ ఉత్కంఠగా మారిన నేపథ్యంలో కెప్టెన్ పాండ్య నిర్ణయాలు.. టీమ్ఇండియా ఫ్యాన్స్​కు కోపం తెప్పించాయి. అలా చేసి ఉంటే మ్యాచ్​లో భారత్ గెలిచేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Ind vs Wi T20
హర్దిక్ పాండ్య కెప్టెన్సీ
author img

By

Published : Aug 7, 2023, 12:07 PM IST

Ind vs Wi T20 Hardik Pandya : వెస్టిండీస్​పై రెండో టీ20లోనూ టీమ్ఇండియా ఓడింది. ఈ మ్యాచ్​లో భారత్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని.. విండీస్ 18.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే భారత్ ఓటమికి జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య అనాలోచిత నిర్ణయాలే కారణమని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరి అభిమానుల ఆగ్రహానికి కారణమైన పాండ్య నిర్ణయాలేంటంటే..

అయితే లక్ష్య ఛేదనలో విండీస్​కు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్ బౌలింగ్ చేసిన పాండ్య.. ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టాడు. నాలుగో ఓవర్లో అర్షదీప్ సింగ్ మేయర్స్​ను పెవిలియన్ చేర్చాడు. దీంతో విండీస్ 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కానీ ఈ ఆరంభాన్ని టీమ్ఇండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరోవైపు నికోలస్ పూరన్.. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తమ జట్టును విజయం అంచులదాకా తీసుకెళ్లి క్యాచౌట్​గా పెవిలియన్ చేరాడు. అప్పుడు 13.6 ఓవర్లకు విండీస్ 126/5 తో ఉంది.

ఆ తర్వాత యుజ్వేెంద్ర చాహల్ బంతి అందుకొని.. 15 ఓవర్​ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో విండీస్ ఆల్​రౌండర్​ జేసన్​ హోల్డర్​ను ఔట్​ చేశాడు. అదే ఓవర్ చివరి బంతికి ప్రమాదకరంగా మారుతున్న హెట్​మెయర్​ను వెనక్కి పంపి.. టీమ్ఇండియాను రేస్​లోకి తీసుకొచ్చాడు. ఈ ఓవర్లో ఓ రనౌట్​ సహా మూడు వికెట్లు కోల్పోయిన విండీస్.. ఇబ్బందుల్లో పడ్డట్టుగానే కనిపించింది.

వెస్టిండీస్ విజయానికి 18 బంతుల్లో 21 పరుగులు కావాల్సిన దశలో.. మళ్లీ చాహల్ బంతితో మ్యాజిక్ చేస్తాడులే అనుకున్నారంతా. కానీ కెప్టెన్ పాండ్య.. చాహల్ చేతికి బంతినివ్వలేదు. బ్యాటింగ్ అంతగా తెలియని జోసెఫ్, అకీల్ సైతం అర్షదీప్, ముకేశ్ బౌలింగ్​లో బౌండరీలు బాది విండీస్​కు విజయం కట్టబెట్టారు.

అయితే విండీస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆ దశలో.. 17 లేదా 18 ఓవర్​ను చాహల్​తో వేయించాల్సిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. టెయిలెండర్ల వికెట్లను చాహల్ కచ్చితంగా పడగొట్టి ప్రత్యర్థిని ఆలౌట్​ చేసేవాడంటున్నారు. కానీ పాండ్య ఎందుకు చాహల్​కు బంతినివ్వలేదో అర్థం కావట్లేదంటూ.. టీమ్ఇండియా ఫ్యాన్స్ అతడిపై కోపంతో ఊగిపోతున్నారు.

అరుదైన రికార్డ్..
కాగా ఈ మ్యాచ్​తో హార్దిక్ పాండ్య టీ20ల్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. పొట్టి ఫార్మాట్ క్రికెట్​లో 4వేల పరుగులతో పాటు 150 వికెట్లు పడగొట్టిన మొదటి భారత క్రికెటర్​గా నిలిచాడు. టీ20ల్లో పాండ్య ఇప్పటివరకు 4391 పరుగులు, 152 వికెట్లు తీశాడు.

Ind vs Wi T20 : ఆసక్తికరంగా రెండో టీ20.. ఈ మ్యాచ్​లోనైనా కుర్రాళ్లు కొట్టేస్తారా?

Ind vs Wi T20 : చెలరేగిన పూరన్.. రెండో టీ20లోనూ భారత్​పై విండీస్ విజయం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.