ETV Bharat / sports

చితక్కొట్టిన సూర్యకుమార్.. విండీస్​కు భారీ లక్ష్యం - IND vs WI t20 series

IND vs WI 3rd T20: IND vs WI 2nd T20: వెస్టిండీస్​తో మూడో టీ20లో భారత బ్యాట్స్​మెన్​ చెలరేగారు. సూర్యకుమార్​ యాదవ్​ అర్ధశతకంతో చెలరేగగా.. ఇషాన్​ కిషాన్​, శ్రేయస్​ అయ్యర్​ రాణించారు. దీంతో విండీస్​ ముందు 185 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది భారత్​.

IND vs WI 3rd T20
IND vs WI 3rd T20
author img

By

Published : Feb 20, 2022, 8:41 PM IST

IND vs WI 2nd T20: విండీస్​తో​ మూడో టీ20లో టీమ్​ఇండియా బ్యాటర్లు​ విజృంభించారు. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత్​.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్​ యాదవ్​ అర్థశతకతంతో(31 బంతుల్లో 65 పరుగులు) చెలరేగగా.. గత రెండు మ్యాచ్​ల్లో తడబడిన ఇషాన్​ కిషాన్​(31 బంతుల్లో 34 పరుగులు) ఈ మ్యాచ్​లో రాణించాడు. విరాట్​ కోహ్లీ, రిషబ్​ పంత్​లకు విశ్రాంతి ఇవ్వగా.. ఈ మ్యాచ్​లో చోటు దక్కించుకున్న రుతురాజ్​ గైక్వాడ్​(4) స్వల్ప వ్యక్తిగత స్కోరుకే వెనుదిరిగాడు.

గైక్వాడ్​ తర్వాత వచ్చిన శ్రేయస్​ అయ్యర్​.. 25 పరుగు చేసి హేడెన్ వాల్ష్​ బౌలింగ్​ హోల్డర్​కు చిక్కాడు. ​తర్వాత బ్యాటింగ్​ వచ్చిన రోహిత్​(7) వ్యక్తిగత స్కోరు వద్ద డొమినిక్​ డ్రేక్స్ బౌలింగ్​లో బౌల్డ్​ అయ్యాడు.

ఆ తర్వాత సూర్యకుమార్​.. వెంకటేశ్​ అయ్యర్​లు చివరి వరకు దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వెంకటేశ్ అయ్యర్​ 19 బంతుల్లో 35 పరుగులు చేశాడు.

విండీస్​ బౌలర్లలో జేసన్​ హోల్డర్​, రోస్టన్ చేజ్​, డొమినిక్​ డ్రేక్స్, హేడెన్​ వాల్ష్, షెపర్డ్​ చెరో వికెట్​ తీశారు.

ఇదీ చూడండి: Harbhajan Singh: 'సాహాలా ఎవరికీ జరగకుండా చూడండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.