Shubman Gill World Record : వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో దారుణంగా విఫలమైన టీమ్ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్.. వన్డే సిరీస్‌ను మాత్రం ఘనంగా ముగించాడు. టెస్టు సిరీస్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 6, 10, 29(నాటౌట్) పరుగులు మాత్రమే సాధించాడు. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌ను కూడా సింగిల్ డిజిట్ స్కోరు(7)తోనే ఆరంభించిన గిల్‌పై విమర్శలు వచ్చాయి. రెండో వన్డేలో 34 పరుగులు సాధించినప్పటికీ జట్టు ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన గిల్ మళ్లీ అభిమానులకు టార్గెట్ అయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడితో కూరుకున్న సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో మాత్రం గిల్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు.
-
Shubman Gill top-scored in the #WIvIND ODI series decider and bagged the Player of the Match award as #TeamIndia won the third & final ODI to clinch the series 👏 👏 pic.twitter.com/jKk4WoanYT
— BCCI (@BCCI) August 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Shubman Gill top-scored in the #WIvIND ODI series decider and bagged the Player of the Match award as #TeamIndia won the third & final ODI to clinch the series 👏 👏 pic.twitter.com/jKk4WoanYT
— BCCI (@BCCI) August 1, 2023Shubman Gill top-scored in the #WIvIND ODI series decider and bagged the Player of the Match award as #TeamIndia won the third & final ODI to clinch the series 👏 👏 pic.twitter.com/jKk4WoanYT
— BCCI (@BCCI) August 1, 2023
పాక్ బ్యాటర్ ప్రపంచ రికార్డు బద్దలు
IND Vs WI 3rd ODI : బ్రియన్ లారా స్టేడియంలో మంగళవారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో శుభమన్ గిల్.. 92 బంతులు ఆడి 11 ఫోర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీతో మెరిసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. తన అద్భుత ఇన్నింగ్స్‌తోపాటు సరికొత్త రికార్డును సృష్టించాడు. సెంచరీ మిస్ అయినా.. పాకిస్థాన్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 27 వన్డే ఇన్నింగ్స్‌లో సగటు 62.48తో 1437 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు.
-
𝗪𝗶𝗻𝗻𝗲𝗿𝘀 𝗔𝗿𝗲 𝗚𝗿𝗶𝗻𝗻𝗲𝗿𝘀! ☺️
— BCCI (@BCCI) August 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations #TeamIndia on winning the ODI series 🙌 🙌#WIvIND pic.twitter.com/NHRD8k5AGe
">𝗪𝗶𝗻𝗻𝗲𝗿𝘀 𝗔𝗿𝗲 𝗚𝗿𝗶𝗻𝗻𝗲𝗿𝘀! ☺️
— BCCI (@BCCI) August 1, 2023
Congratulations #TeamIndia on winning the ODI series 🙌 🙌#WIvIND pic.twitter.com/NHRD8k5AGe𝗪𝗶𝗻𝗻𝗲𝗿𝘀 𝗔𝗿𝗲 𝗚𝗿𝗶𝗻𝗻𝗲𝗿𝘀! ☺️
— BCCI (@BCCI) August 1, 2023
Congratulations #TeamIndia on winning the ODI series 🙌 🙌#WIvIND pic.twitter.com/NHRD8k5AGe
అంతర్జాతీయ వన్డేల్లో 27 వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించింది వీళ్లే!
- శుభ్‌మన్ గిల్- 1437
- ఇమాన్ ఉల్ హక్- 1381
- రాసీ వాన్ డెర్ డసెన్- 1353
- రియాన్ టెన్ డొషాటే- 1353
- జొనాథన్ ట్రాట్- 1342
బాల్ పాతబడిన కొద్దీ బ్యాటింగ్ కాస్త కష్టంగా మారింది: గిల్
మూడో వన్డే అనంతరం శుభమన్ గిల్ మాట్లాడాడు. "గత రెండు మ్యాచుల్లో సరిగా ఆడలేకపోయాను. ఇలాంటి సమయంలో ఈ ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకమైంది. ఇంకా భారీ స్కోరు మార్చాల్సిన సమయంలో ఔటై పెవిలియన్‌కు చేరడం నిరాశపర్చినా.. భారత్ విజయం సాధించడంతో ఆనందంగా ఉంది. ట్రినిడాడ్ పిచ్ చాలా బాగుంది. ఆరంభంలో బంతి చాలా చక్కగా బ్యాట్ మీదకు వచ్చింది. అయితే, బాల్ పాతబడిన కొద్దీ బ్యాటింగ్ కాస్త కష్టంగా మారింది. వన్డేల్లో ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచాలంటే త్వరగా వికెట్లు తీయాలి. మా బౌలర్లు అద్భుతం చేశారు" అని గిల్ తెలిపాడు.