ETV Bharat / sports

జోష్​లో టీమ్​ ఇండియా.. టీ20 సిరీస్​పై విజయంపై దృష్టి - భారత్​ విండీస్

IND vs WI T20: విండీస్​పై వన్డేల్లో వైట్​వాష్​, తొలి టీ20లో విజయంతో ఉత్సాహంగా ఉన్న టీమ్ఇండియా శుక్రవారం రెండో టీ20లో గెలిచి, సిరీస్​ సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఈ టీ20తో మళ్లీ ఫామ్​లోకి రావాలని విండీస్​ జట్టు ఆశిస్తోంది.

IND vs WI T20
టీమ్​ఇండియా
author img

By

Published : Feb 18, 2022, 5:30 AM IST

IND vs WI T20: రోహిత్​ శర్మ సారథ్యంలోని టీమ్​ఇండియా వెస్టిండీస్​​​పై ఆధిపత్యం చెలాయిస్తోంది. వన్డేల్లో విండీస్​ జట్టును వైట్​వాష్​ చేసిన రోహిత్​ సేన.. తొలి టీ20లో కూడా ఘన విజయం సాధించింది. రెండో టీ20 కూడా గెలిచి సిరీస్​ సొంతం చేసుకోవాలని ఉత్సాహంగా ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగనున్న రెండో టీ20పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

తొలి టెస్టులో గాయపడిన వెంకటేశ్​ అయ్యర్​, దీపక్​ చాహర్​లు రెండో టీ20కి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయం తీవ్రత ఎక్కవైతే యాజమాన్యం వారికి విశ్రాంతినిచ్చి ఆ స్థానంలో వేరే వారికి బరిలోకి దింపొచ్చు.

కోహ్లీ ఫామ్​లోకి వస్తే..

తొలి టీ20లో టీమ్​ఇండియా కెప్టెన్​, ఓపెనర్​ రోహిత్​ శర్మ అదరగొట్టాడు. అయితే గత కొంతకాలంగా బ్యాటింగ్​లో తడబడుతున్న విరాట్​ కోహ్లీ.. మంగళవారం జరిగిన మ్యాచ్​లో కూడా ఆకట్టుకోలేకపోయాడు. రెండో టీ20లో అయినా కోహ్లీ ఫామ్​లోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

స్పెషలిస్టులే కానీ.

వన్డేల్లో టీమ్​ఇండియా చేతిలో ఘోర పరాజయం చవిచూసిన విండీస్​ జట్టు.. టీ20 సిరీస్​లో మాత్రం భారత్​కు సవాల్​ విసురుతుందని అభిమానులు ఆశించారు. కానీ టీ20 స్పెషలిస్ట్​గా పేర్కొనే ఈ జట్టు తొలి టీ20లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. టీమ్​ఇండియాను ఇబ్బంది పెడుతుంది అని అనుకుంటే.. భారత్​ ఆధిపత్యానికి లొంగిపోయింది.

ఈ నేపథ్యంలో రెండో టీ20లోనైనా విండీస్​ పుంజుకుని తనదైన శైలిలో టీమ్​ఇండియాను కట్టడి చేస్తుందా.. లేక రోహిత్​సేన తన జోరును కొనసాగిస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తుది జట్లు (అంచనా)

భారత జట్టు: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్​), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్​), వెంకటేష్ అయ్యర్/ శ్రేయస్​ అయ్యర్​, దీపక్ చాహర్/ ఆవేశ్​ ఖాన్​ , భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, చాహల్​

వెస్టిండీస్ జట్టు: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (కీపర్​), రోవ్‌మన్ పావెల్, కీరన్ పొలార్డ్ (కెప్టెన్​), రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, ఓడియన్ స్మిత్, ఫాబియన్ అలెన్, షెల్డన్ కాట్రెల్

ఇదీ చూడండి : IND VS WI: మూడో టీ20కు అభిమానులకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.