ETV Bharat / sports

చెలరేగిన టీమ్​ఇండియా.. విండీస్​ లక్ష్యం 187 - kohli

IND vs WI 2nd T20: వెస్టిండీస్​తో రెండో టీ20లో భారత బ్యాట్స్​మెన్​ విజృభించారు. కోహ్లీ, పంత్​ అర్థశతకాలు బాదారు. దీంతో విండీస్​ ముందు 187 పరుగులు లక్ష్యం ఉంది.

rishab pant
పంత్
author img

By

Published : Feb 18, 2022, 8:50 PM IST

IND vs WI 2nd T20: విండీస్​ రెండో టీ20లో టీమ్​ఇండియా బ్యాట్స్​మెన్​ చెలరేగారు. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత్​ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. గత కొంతకాలంగా బ్యాటింగ్​లో తడపడుతున్న విరాట్​ కోహ్లీ.. ఈ మ్యాచ్​తో ఫామ్​లోకి వచ్చాడు. 41 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్​లో ఏడు ఫోర్లు ఒక సిక్సర్​ బాదాడు. కానీ రోస్టన్​ ఛేజ్​ బౌలింగ్​లో క్లీన్​ బౌల్డ్​ అయ్యాడు.

ఆ తర్వాత రిషబ్​ పంత్​, వెంకటేశ్​ అయ్యర్​లు చివరి ఓవర్లలో దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఏడు ఫోర్లు ఓ సిక్సర్​ బాదిన పంత్​ 28 బంతుల్లో 52 పరుగులు చేశాడు. మరోవైపు అయ్యర్​ 18 బంతుల్లో 33 పరుగులు చేశాడు.

విండీస్​.. టీమ్​ఇండియాను కట్టడి చేయాలని భావించినా విఫలమైంది. అలెన్​ స్థానంలో జట్టులోకి వచ్చిన హోల్డర్​ భారీగా పరుగులు సమర్పించాడు.

ఇదీ చూడండి : అండర్​-19 ప్రపంచకప్​ హీరోపై ఆ ఆరోపణలు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.