ETV Bharat / sports

IND VS WI 2023 : టీమ్‌ఇండియా 'బజ్‌బాల్'.. ఐదో రోజు ఆటలో అదే కీలకం.. ఏం చేస్తారో?

ind vs wi 2023 second test : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్​ఇండియా దూకుడుగా ఆడుతోంది. రక్షణాత్మక ధోరణిలో ఆడే టీమ్​ఇండియా.. ఈ సారి మ్యాచ్​లో 'బజ్‌బాల్' క్రికెట్‌ ఆడి వీలైనంత త్వరగా ఎక్కువ పరుగులను సాధించింది. ఇక ఐదో రోజు ఆటలో అది కనుక జరిగితే విజయం మనదే అవుతుంది. ఆ వివరాలు..

IND VS WI : టీమ్‌ఇండియా 'బజ్‌బాల్'.. ఐదో రోజు ఆటలో అదే కీలకం.. ఏం చేస్తారో?

author img

By

Published : Jul 24, 2023, 9:05 AM IST

ind vs wi 2023 second test: ఎప్పుడు కాస్త రక్షణాత్మక ధోరణిలో ఆడే టీమ్​ఇండియా.. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మాత్రం దూకుడుగా ఆడుతోంది. మనోళ్లు వేగంగా పరుగులు చేసి ప్రత్యర్థి జట్టు ముందు 365 భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. అలానే బౌలర్లు కూడా వికెట్లను ఫటా ఫట్​ తీస్తున్నారు. అలా నాలుగో రోజు ఆట పూర్తయ్యేసమయానికి విండీస్ జట్టు 76/2 స్కోరుతో క్రీడులో నిలిచింది. అశ్విన్‌ రెండు వికెట్లు పడగొట్టి జోష్ మీదున్నాడు. అయితే చివరి రోజు వర్షం వల్ల ఎటువంటి అంతరాయం కలగకుండా ఉంటే.. దాదాపుగా మనోళ్లదే విజయం అవుతుంది.

బజ్​బాల్​ ఆడేశారు.. వెస్టిండీస్​ను మొదటి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌట్‌ చేశారు. అయితే ఇందులో సిరాజ్‌ (5/60) ప్రధాన పాత్ర పోషించాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మన బ్యాటర్లు 24 ఓవర్లలోనే 181 పరుగులు చేసి డిక్లెర్ ఇచ్చేశారు. 'బజ్‌బాల్' క్రికెట్‌ ఆడి ఈ పరుగులు చేశారు. ఈ మధ్య కాలంలో ఇంగ్లాండ్‌ జట్టు మాత్రమే ఇలా ఆడుతోంది. ఇప్పుడు మనోళ్లు యశస్వి జైస్వాల్ (30 బంతుల్లో 38; 4x4, 1x6), రోహిత్ (44 బంతుల్లో 57; 5x4, 3x6), శుభ్‌మన్‌ గిల్ (37 బంతుల్లో 29*; 1x4), ఇషాన్‌ కిషన్ (34 బంతుల్లో 52*; 4 x4, 2x6) కూడా దూకుడుగా ఆడి ఆకట్టుకున్నారు. సుమారు 7.54 రన్‌రేట్‌తో పరుగులు చేశారు.

తొలి సెషన్​ కీలకం.. 76/2 స్కోరుతో ఉన్న వెస్టిండీస్​కు ఇంకా 289 పరుగులు అవసరం. అలాగే భారత్‌కు 8 వికెట్లు అవసరం. అశ్విన్‌- సిరాజ్‌ మంచి ఫామ్​లో ఉన్నారు. కాబట్టి ఐదో రోజు ఆటలో మొదటి సెషన్‌ చాలా కీలకం. ఈ సెషన్‌లో వీలైనంత త్వరగా వికెట్లు తీస్తే.. ప్రత్యర్థి జట్టును ఓడించే అవకాశాలు టీమ్​ఇండియాకు చాలా ఎక్కువగా ఉంటాయి.

అదే నాలుగో రోజు ఆట తొలి గంటలో... విండీస్‌ పతనాన్ని మనోళ్ల ఎలా శాసించారో అలానే ఐదో రోజు చూడా ప్రారంభంలోనే చేయాలి. అప్పుడు సిరీస్​ను క్లీన్​ స్వీప్​ చేయొచ్చు. క్రీజులో ప్రస్తుతం త్యాగ్‌నారాయణ్‌ చంద్రపాల్ (24*), బ్లాక్‌వుడ్ (20*) కొనసాగుతున్నారు. వీరిద్దరితో పాటు యంగ్ బ్యాటర్ అథనేజ్‌, జోషువా ద సిల్వా, జాసన్ హోల్డర్​ వికెట్లను తీయాలి. అప్పుడు విజయం భారత్​దే. కానీ వర్షం ముప్పు పొంచి ఉంది. కాబట్టి ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేం.

ఇదీ చూడండి :

IND VS WI 2023 : సిరాజ్ దెబ్బకు విండీస్ విలవిల​.. పట్టుబిగించిన భారత్‌

Ind vs Pak Final 2023 : ఫైనల్​లో భారత్ ఓటమి.. ఎమర్జింగ్ ట్రోఫీ పాక్​దే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.