ETV Bharat / sports

IND VS WI 2023 : విండీస్​తో రెండో టెస్ట్​.. టీమ్​ఇండియా రికార్డులే రికార్డులు.. - Ravichandran Ashwin westinides

ind vs wi 2023 second test: విండీస్​తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్​ఇండియా ప్లేయర్స్​ పలు రికార్డులను నమోదు చేశారు. ముఖ్యంగా అశ్విన్​, ఇషాన్​ కిషన్​ అరుదైన ఘనతను అందుకున్నారు. దిగ్గజాల సరసన చేరాలు. ఆ వివరాలు..

IND VS Wi
IND VS Wi 2023 : విండీస్​తో రెండో టెస్ట్​.. టీమ్​ఇండియా రికార్డులు రికార్డులే..
author img

By

Published : Jul 24, 2023, 10:29 AM IST

ind vs wi 2023 second test: విండీస్​తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్​ఇండియా మంచి దూకుడుగా ఆడుతోంది. ప్రత్యర్థి జట్టు ముందు 365 భారీ లక్ష్యాన్ని ఉంచింది. నాలుగు రోజులు ఆట ముగిసేసరికి.. విండీస్ జట్టు 76/2 స్కోరుతో క్రీడులో నిలిచింది. ఓ సారి ఈ మ్యాచ్​లో ఇప్పటివరకు నమోదైన రికార్డులను చూద్దాం..

  • ishan kishan strike rate vs Wi : వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ ఓ ఘనత అందుకున్నాడు. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేసిన మూడో వికెట్‌ కీపర్​గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 152.94 స్ట్రైక్‌రేట్‌తో 34 బంతుల్లోనే 52 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఆసీస్‌ మాజీ వికెట్‌ కీపర్ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ 172.88 స్ట్రైక్‌రేట్‌తో 59 బంతుల్లో 102 అజేయ పరుగులు సాధించాడు. రిషభ్‌ పంత్ 161.29 స్ట్రైక్‌రేట్‌తో 31 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు.
  • ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో టీమ్​ఇండియా తరఫున అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేసిన బ్యాటర్ల లిస్ట్​లో చేరాడు ఇషాన్‌ కిషన్‌. 152.94 స్ట్రైక్​ రేట్​తో ఆడిన ఇతడు.. ఇప్పుడు ఈ జాబితాలో నాలుగో బ్యాటర్​గా నిలిచాడు. కనీసం యాభైకుపైగా పరుగులు చేసిన జాబితాలో కపిల్ దేవ్ 161.81 స్టైక్​రేట్​తో అందరికన్నా ముందున్నాడు. ఆ తర్వాత రిషభ్‌ పంత్ 161.29 స్ట్రైక్​ రేట్​తో కొనసాగుతుండగా, శార్దూల్ ఠాకూర్ 158.33 స్ట్రైక్​రేట్​తో ఉన్నాడు.
  • ఇకపోతే కనీసం 20 ఓవర్లు ఆడిన ఓ ఇన్నింగ్స్‌లో.. అత్యధిక రన్‌రేట్‌తో పరుగులు సాధించిన ఫస్ట్ టీమ్​గా టీమ్​ఇండియా నిలిచింది. వెస్టిండీస్​పై సెంకడ్​ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 24 ఓవర్లలో 7.54 రన్‌రేట్‌తో 181/2 స్కోరు చేసింది. ఇప్పటి వరకు ఈ లిస్ట్​లో పాకిస్థాన్​పై అస్ట్రేలియా జట్టు సాధించిన ఘనత ఉంది. ఆసీస్​ టీమ్​.. 7.53 రన్‌రేట్‌తో ఓ ఇన్నింగ్స్ ఆడింది.
  • ashwin vs west indies ఇంటర్నేషనల్​ క్రికెట్​లో అత్యధిక వికెట్లు తీసిన సెకండ్ టీమ్​ఇండియా బౌలర్​గా రవిచంద్రన్ అశ్విన్‌ మార్క్​ను అందుకున్నాడు. వెస్టిండీస్​ రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు రెండు దక్కించుకున్న అశ్విన్‌.. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 712 వికెట్లను తీశాడు. ఈ లిస్ట్​లో అనిల్‌ కుంబ్లేదే 956 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక అశ్విన్​ కారణంగా హర్భజన్‌సింగ్‌ (711) మూడో స్థానానికి పడిపోవాల్సి వచ్చింది.
  • వెస్టిండీస్​పై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు. ఇప్పటి వరకు వెస్టిండీస్‌పై 75 వికెట్లు తీసిన అతడు .. 74 వికెట్లతో ఉన్న దిగ్గజ స్పిన్నర్​ అనిల్‌ కుంబ్లేను అధిగమించాడు. అయితే ఈ జాబితాలో కపిల్‌దేవ్‌ అందరికన్నా ముందున్నాడు. అతడు తన టెస్టు కెరీర్‌లో వెస్టిండీస్​పై 89 వికెట్లు తీశాడు.

ఇదీ చూడండి :

IND VS WI 2023 : టీమ్‌ఇండియా 'బజ్‌బాల్'.. ఐదో రోజు ఆటలో అదే కీలకం.. ఏం చేస్తారో?

IND VS WI 2023 : సిరాజ్ దెబ్బకు విండీస్ విలవిల​.. పట్టుబిగించిన భారత్‌

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.