తొలి టెస్టులో దక్షిణాఫ్రికాకు భారత్ 305 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 174 పరుగులకు ఆలౌటైంది. దీంతో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం (130)తో కలుపుకుని భారత్ 304 పరుగుల లీడ్ సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు కేఎల్ రాహుల్ 23, మయాంక్ అగర్వాల్ 4, శార్దూల్ ఠాకూర్ 10, ఛెతేశ్వర్ పుజారా 16, విరాట్ కోహ్లీ 18, అజింక్య రహానె 20, రిషభ్ పంత్ 34, అశ్విన్ 14, షమీ 1, బుమ్రా 7* పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ 4, జాన్‌సెన్ 4, ఎంగిడి 2 వికెట్లు పడగొట్టారు.
కట్టుదిట్టంగా ప్రొటీస్ బౌలింగ్
ఓవర్‌నైట్ 16/1 స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. శార్దూల్‌ను ఔట్ చేసి వికెట్ల పతనం ప్రారంభించిన రబాడ (4/42).. టీమ్‌ఇండియా తక్కువ స్కోరుకే పరిమితం కావడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం రబాడతోపాటు జాన్‌సెన్, ఎంగిడి విజృంభించడం వల్ల భారత్ ఆటగాళ్లు పరుగులు చేసేందుకు ఇబ్బందిపడ్డారు.
ఇదీ చూడండి: కోహ్లీ ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే.. ఈ ఏడాది కూడా సెంచరీ లే!