ETV Bharat / sports

ఆ విషయం గురించి తర్వాత ఆలోచిస్తాం: రోహిత్​ శర్మ - టీమ్​ఇండియా శ్రీలంక

IND VS SL Rohith Sharma: శ్రీలంకను క్లీన్​స్వీప్​ చేయడంపై ఆనందం వ్యక్తం చేశాడు కెప్టెన్​ రోహిత్​శర్మ. యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారంటూ ప్రశంసించాడు.

rohith sharma
రోహిత్​ శర్మ
author img

By

Published : Feb 28, 2022, 7:41 AM IST

IND VS SL Rohith Sharma: మూడో టీ20లోనూ గెలిచి లంకను క్లీన్​స్వీప్​ చేయడంపై హర్షం వ్యక్తం చేశాడు కెప్టెన్​ రోహిత్​ శర్మ. ఈ విజయంతో జట్టు బెంచ్‌ బలం ఎంతో ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నాడు. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించామన్నాడు.

"ఈ సిరీస్‌తో చాలా పాజిటివ్స్‌ వచ్చాయి. ఈ విజయంతో జట్టు బెంచ్‌ బలం ఎంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. యువ ఆటగాళ్లకు మంచి అవకాశం లభించింది. జట్టులో వారి స్థానాలపై ఆందోళన అవసరం లేదు. అవసరాన్ని బట్టి వారిని జట్టులోకి తీసుకుంటాం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక ముందు సిరీస్‌ల్లో ఆడుతాం. జట్టు కూర్పు అనేది చాలా కఠినమైన సవాలు. టెస్టు జట్టుకు ఎవరిని తీసుకోవాలనేది మొహాలీ చేరుకున్న తర్వాత ఆలోచిస్తాం" అని రోహిత్‌ చెప్పాడు.

శ్రీలంక కెప్టెన్‌ శనక మాట్లాడుతూ.. "అద్భుతంగా రాణించిన భారత జట్టుకు అభినందనలు. మా సీనియర్‌ బౌలర్లు లేకుండా ఆడడం చాలా కఠినంగా సాగింది. ఈ మ్యాచ్‌లో సైతం బ్యాటింగ్‌లో తొలి ఆరు ఓవర్లను ఉపయోగించుకోలేకపోయాం. గతేడాది మా పేస్‌ బౌలింగ్‌ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇది అంతర్జాతీయ క్రికెట్‌. పరిస్థితులకు తగ్గట్లు ఆడాలి" అని అన్నాడు.

కాగా, మూడో టీ20లో టీమ్‌ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లంక నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లను నష్టపోయి 16.5 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ని 3-0 తేడాతో భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. భారత బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్‌ (73*) మరోసారి అర్ధసెంచరీతో చెలరేగాడు. రవీంద్ర జడేజా (22*), సంజూ శాంసన్‌ (18), దీపక్‌ హుడా (21) పరుగులు చేశారు. లంక బౌలర్లలో లహిరు కుమార 2, చమీర, కరుణరత్నె తలో వికెట్ తీశారు. ఈ టోర్నీలో వరుసగా మూడు అర్ధసెంచరీలతో చెలరేగిన శ్రేయస్‌ అయ్యర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందుకున్నాడు.

ఇదీ చూడండి: హాకీలో భారత జట్లకు ఓటమి.. ఆ క్రీడల్లో తెలుగు తేజాల జోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.