ETV Bharat / sports

కోహ్లీ వందో టెస్టులో జడ్డూ 'వంద'- టీమ్​ఇండియా భారీ స్కోరు

IND VS SL first test: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు భారత్ ఇన్నింగ్స్​ నిలకడగా కొనసాగుతోంది. లంచ్ విరామానికి 7 వికెట్లు కోల్పోయి 468 పరుగులు చేసింది టీమ్​ఇండియా.

ind vs srilank test
jadeja century
author img

By

Published : Mar 5, 2022, 11:46 AM IST

Updated : Mar 5, 2022, 12:01 PM IST

IND VS SL first test: టీమ్​ఇండియా, శ్రీలంక జట్ల మధ్య మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమ్​ఇండియా భారీ స్కోరు చేసింది. రెండో రోజు లంచ్​ సమయానికి 7 వికెట్లకు 468 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా సెంచరీతో(102 నాటౌట్​) అదరగొట్టాడు. అశ్విన్​ 61 పరుగులు చేసి వెనుదిరిగాడు. జడేజా, జయంత్​ యాదవ్​(2) క్రీజులో ఉన్నారు. లంక బౌలర్లలో లక్మల్​, ఎంబుల్దేనియా చెరో రెండు వికెట్లు తీశారు. ఫెర్నాండో, కుమార, ధనంజయ డిసిల్వా ఒక్కో వికెట్​ తీశారు.

నలుపు రంగు బ్యాండ్లు ధరించి..

ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లు షేన్​ వార్న్​, రోడ్నీ మార్ష్​ శుక్రవారం మృతి చెందారు. అందుకు సంఘీభావంగా శనివారం మ్యాచ్​​ ప్రారంభానికి ముందు భారత, శ్రీలంక ఆటగాళ్లంతా నిమిషం మౌనం పాటించారు. నలుపు రంగు బ్యాండ్లు చేతికి ధరించి సంతాపం తెలిపారు.

ఇదీ చదవండి: Ball of The Century: షేన్‌వార్న్‌ 'బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ' చూసేయండి..

Last Updated : Mar 5, 2022, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.