స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌లకు వేర్వేరు జట్లను మంగళవారం బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. లంకతో టీ20 సిరీస్‌కు భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ దూరమయ్యారు. విశ్రాంతి అనంతరం రోహిత్, రాహుల్, కోహ్లీలు వన్డే సిరీస్‌కు తిరిగి రానుండగా.. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు మాత్రం వన్డే జట్టులో చోటు దక్కలేదు. అతడికి నిరాశ ఎదురైంది.
అసలు ఇప్పటికే చాలా కాలంగా టీ20లకు దూరమైన గబ్బర్.. కనీసం వన్డేల వరకు అయినా మళ్లీ జట్టులో చోటు దక్కించుకుని, కొన్ని సిరీస్‌ల్లో కెప్టెన్‌గానూ వ్యవహరిస్తున్నాడు. అలానే ఇటీవలే బంగ్లాదేశ్ సిరీస్‌లో సారథిగా వ్యవహరించిన అతడికి.. లంకతో వన్డే సిరీస్‌లో చోటు దక్కకపోవడం గమనార్హం. ఆ సిరీస్‌లో విఫలమైన నేపథ్యంలో అతడిపై సెలక్టర్లు వేటు వేశారు. దీంతో అతడు తన స్థానాన్ని నిలుపుకోలేకపోయాడు. దీంతో 2023 ప్రపంచకప్ ఆడి కెరీర్ ముగిద్దామనుకున్న అతడికి నిరాశ తప్పలేదు. లంకతో సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో ధావన్ కెరీర్ దాదాపు ముగిసినట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వీరు కూడా ఎంపికయ్యారు.. ఇకపోతే బంగ్లాపై డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్ కూడా లంకతో వన్డే సిరీస్‌కు ఏకైక స్పెషలిస్టు వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. టీ20ల్లో అతడితో పాటు సంజు శాంసన్‌కు అవకాశం దక్కింది. స్పిన్నర్లు చాహల్, అక్షర్ పటేల్, సుందర్.. యువ పేసర్లు అర్ష్‌దీప్, ఉమ్రాన్ మాలిక్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు. కానీ సీనియర్ అయిన ధావన్‌కు మాత్రం నిరాశ ఎదురైంది. కాగా, లంకతో మూడు టీ20లు జనవరి 3, 5, 7 తేదీల్లో ముంబయి, పుణె, రాజ్‌కోట్‌ల్లో జరుగుతాయి. 10, 12, 15 తేదీల్లో జరిగే వన్డేలకు గువాహటి, కోల్‌కతా, తిరువనంతపురం ఆతిథ్యమిస్తాయి.
ఇదీ చూడండి: 12 ఏళ్ల నిరీక్షణకు సాక్ష్యాలు.. జెర్సీలపై సంతకాలు చూసి మురిసిపోయిన ఉనద్కత్