Ind vs Sa World Cup 2023 : 2023 ప్రపంచకప్‌లో అసలు సిసలైన పోరుకు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన టాప్ 2 జట్లు నవంబర్ 5న తలపడనున్నాయి. ఆదివారం కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్.. సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఇప్పటికే సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న భారత్.. విజయ పరంపర కొనసాగించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరోవైపు భారత్‌పై నెగ్గి సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లాలని భావిస్తోంది.
టీమ్ఇండియా ఎలా ఉందంటే? భారత్ టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా టోర్నీని ప్రారంభించింది. అందుకు తగ్గట్లుగానే టీమ్ఇండియా ఆటగాళ్లంతా కలిసి కట్టుగా రాణించి విజయాలు సాధిస్తున్నారు. టాపార్డర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌తో ఓపెనర్ శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ కూడా టచ్‌లోకి వచ్చారు. మిడిలార్డర్లో కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఉండనే ఉన్నారు. ఇక టీమ్ఇండియా బౌలింగ్ దళం.. ఇప్పటివరకు జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించారు. స్వదేశీ పిచ్‌లపై అద్భుతంగా రాణిస్తూ.. ప్రత్యర్థుకు చెక్ పెడుతున్నారు. ఆదివారం నాటి మ్యాచ్‌లో కూడా అందరూ సమష్టిగా రాణించి గెలుపు స్ట్రీక్‌ను కంటిన్యూ చేయాలని టీమ్ఇండియా ఆశిస్తోంది.
సఫారీ జట్టు.. మెగాటోర్నీలోకి సౌతాఫ్రికా అంతంత మాత్రం అంచనాలతో ఎంట్రీ ఇచ్చి.. అదరిపోయే ప్రదర్శనతో ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించింది. ఫలితంగా సౌతాఫ్రికా జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. క్వింటన్ డికాక్, మర్క్రమ్, వన్‌డర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, క్లాసెన్, మార్కో జాన్సన్‌తో సఫారీల బ్యాటింగ్ బలంగా ఉంది. మరోవైపు ఎంగ్డి, రబాడా, కేషవ్ మహరాజ్, గార్లాడ్తో బౌలింగ్ అటాకింగ్ కూడా భయంకరంగా ఉంది.
జోష్‌లో రెండు జట్లు.. టోర్నీలో భారత్.. చివరగా శ్రీలంకతో తలపడగా ఏకంగా 302 పరుగుల భారీ విక్టరీ నమోదు చేసింది. మరోవైపు సౌతాఫ్రికా తమ చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 190 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఇలా ఈ రెండు జట్లూ.. తమతమ చివరి మ్యాచ్‌లో గెలిచి మంచి జోష్‌మీదున్నాయి. దీంతో ఇరు జట్లు రెట్టించిన ఉత్సాహంతో పోటీ పడడం ఖాయం. మరి ఆదివారం ఎవరిది పైచేయి కానుందో తెలుసుకోవాలంటే వేచి చూడాలి.
ఆ ఒక్కటీ! ప్రస్తుత ప్రపంచకప్‌లో ఘన విజయాలతో దూసుకుపోతున్న సఫారీ జట్టుకు ఈ టోర్నీలో భంగపాటు ఎదురైంది. టోర్నీలో మేటి జట్లను సైతం ఒంటిచేత్తో ఓడించిన సౌతాఫ్రికా.. పసికూన నెదర్లాండ్స్‌తో 38 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమిని సఫారీ జట్టు ఫ్యాన్స్ ఓ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.
Ind vs Sa World Cup Head To Head : ప్రపంచకప్ చరిత్రలో భారత్ - సౌతాఫ్రికా ఇప్పటివరకు 5సార్లు తలపడ్డాయి. ఈ ముఖాముఖి పోరులో సఫారీలదే పైచేయిగా ఉంది. ఐదింట్లో 3 మ్యాచ్‌లు సౌతాఫ్రికా (1992, 1999, 2011) నెగ్గగా.. రెండింట్లో టీమ్ఇండియా (2015, 2019) గెలిచింది. కాగా, ఆదివారం నాటి మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. ఈ రికార్డు సమం అవుతుంది.
వైస్ కెప్టెన్‌గా రాహుల్.. టీమ్ఇండియా రెగ్యులర్ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఆ బాధ్యతలను టీమ్ మేనేజ్మెంట్.. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు అప్పగించింది.
-
Bringing the Protea Fire to the semi-finals 🔥
— ICC (@ICC) November 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
South Africa are through to the penultimate stage of #CWC23 👏 pic.twitter.com/dnJQlVhEqX
">Bringing the Protea Fire to the semi-finals 🔥
— ICC (@ICC) November 4, 2023
South Africa are through to the penultimate stage of #CWC23 👏 pic.twitter.com/dnJQlVhEqXBringing the Protea Fire to the semi-finals 🔥
— ICC (@ICC) November 4, 2023
South Africa are through to the penultimate stage of #CWC23 👏 pic.twitter.com/dnJQlVhEqX
- " class="align-text-top noRightClick twitterSection" data="">
టీమ్ఇండియాకు షాక్ - ప్రపంచకప్ మిగతా టోర్నీకి హార్దిక్ దూరం - అతడి స్థానంలో ఎవరంటే?
దక్షిణాఫ్రికా చేతిలో కివీస్ చిత్తు, సెంచరీలతో అదరగొట్టిన డీకాక్, డసెన్