IND vs SA Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాటర్లు తడబడ్డారు. కోహ్లీ గైర్జాజరుతో ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్ (50) అర్ధసెంచరీతో రాణించగా.. స్పిన్నర్ అశ్విన్ (46) ఆకట్టుకున్నాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు పరిమితమైంది భారత జట్టు.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు మయాంక్ (26), రాహుల్ (50) శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 36 పరుగులు జోడించారు. అనంతరం మయాంక్‌తో పాటు పుజారా (3), రహానే (0) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. దీంతో 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది టీమ్ఇండియా. అనంతరం విహారితో కలిసి ఇన్నింగ్స్‌ను గాడినపెట్టాడు రాహుల్. మంచి టచ్‌లో కనిపించిన విహారి (20)ని వాండర్ డస్సేన్ అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ పంపాడు. అనంతరం పంత్ (17) ఓపికగా ఆడినా భారీ స్కోర్ సాధించలేకపోయాడు. ఈ క్రమంలోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న రాహుల్.. ఆ పరుగుల వద్దే ఔట్ కావడం వల్ల భారత్ చిక్కుల్లో పడింది. కానీ స్పిన్నర్ అశ్విన్ గట్టి పట్టుదలతో పోరాడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా బంతికొక పరుగు రాబడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే 46 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఇతడిని ఔట్ చేశాడు జాన్సెస్. చివర్లో బుమ్రా (14) మెరవడం వల్ల 202 పరుగులకు పరిమితమైంది భారత్.