ind vs Sa T20 : సఫారీ గడ్డపై భారత పోరాటం ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. స్వదేశంలో బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై రాణించిన భారత బ్యాటర్లకు, సఫారీ గడ్డపై కఠిన సవాల్ ఎదురుకానుంది. ఫ్రీడమ్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచి ఈ పర్యటనలో శుభారంభం చేయాలని టీమ్ఇండియా భావిస్తోంది. రోహిత్ శర్మ, కోహ్లీ, బుమ్రా, హార్దిక్ పాండ్యా సహా సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో అనుభవం అంతగా లేని యువ జట్టు ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు సఫారీ బౌలర్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. అనుభవజ్ఞులు లేని ఆస్ట్రేలియా బౌలింగ్ దళంపై స్వదేశంలో టీమిండియా బాగానే రాణించింది. అయితే దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను దక్షిణాఫ్రికాలో ఎదుర్కోవడం అంత తేలిక కాదు.శుభ్‌మన్ గిల్,రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్‌వర్మలతో టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది.
రుతురాజ్ గైక్వాడ్ ఆస్ట్రేలియాపై 52 బంతుల్లోనే సెంచరీ చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. జైస్వాల్, గిల్, గైక్వాడ్ వరుసగా బ్యాటింగ్‌కు రానున్నారు. నాలుగో స్థానంలో ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్, జితేశ్ వర్మలో ఎవరికి తుది జట్టులో స్థానం దక్కుతుందో చూడాలి. తర్వాత సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా మంచి టచ్‌లో ఉన్నాడు. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కెప్టెన్ ఐడెన్ మాక్రమ్‌లతో సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. హార్డ్ హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్ విధ్వంసం సృష్టిస్తున్నాడు.
టీమిండియా పేస్ విభాగమే కాస్త ఆందోళనపరుస్తోంది. సిరాజ్ చేరికతో పేస్ బౌలింగ్ కాస్త బలోపేతమైంది. టీ 20ల్లో నెంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్‌పై చాలా ఆశలు ఉన్నాయి. దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్ పేస్ దళాన్ని మోయనున్నారు. కగిసో రబాడ, ఎంగిడి గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైనా జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, ఫెహ్లుక్వాయో పేస్‌తో భారత బ్యాటర్లకు తిప్పలు తప్పవు.
-
First practice session in South Africa 👍
— BCCI (@BCCI) December 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Interaction with Head Coach Rahul Dravid 💬
Fun, music & enjoyment with teammates 🎶
In conversation with @rinkusingh235 👌 👌 - By @RajalArora
P. S. - Don't miss @ShubmanGill's special appearance 😎
Full Interview 🎥 🔽 #TeamIndia |… pic.twitter.com/I52iES9Afs
">First practice session in South Africa 👍
— BCCI (@BCCI) December 9, 2023
Interaction with Head Coach Rahul Dravid 💬
Fun, music & enjoyment with teammates 🎶
In conversation with @rinkusingh235 👌 👌 - By @RajalArora
P. S. - Don't miss @ShubmanGill's special appearance 😎
Full Interview 🎥 🔽 #TeamIndia |… pic.twitter.com/I52iES9AfsFirst practice session in South Africa 👍
— BCCI (@BCCI) December 9, 2023
Interaction with Head Coach Rahul Dravid 💬
Fun, music & enjoyment with teammates 🎶
In conversation with @rinkusingh235 👌 👌 - By @RajalArora
P. S. - Don't miss @ShubmanGill's special appearance 😎
Full Interview 🎥 🔽 #TeamIndia |… pic.twitter.com/I52iES9Afs
సిరీస్ షెడ్యూల్.
టీ20
- తొలి టీ20 - డిసెంబర్ 10- డర్బన్ రాత్రి 7.30
- రెండో టీ20- డిసెంబర్ 12- కెబెరా రాత్రి 8.30
- మూడో టీ20- డిసెంబర్ 14- జొహన్నెస్‌బర్గ్ రాత్రి 8.30
వన్డేలు
- తొలి వన్డే- డిసెంబరు 17- జొహన్నెస్‌బర్గ్ మధ్యాహ్నం 1.30
- రెండో వన్డే- డిసెంబరు 19- కెబెరా మధ్యాహ్నం 4:30
- మూడో వన్డే- డిసెంబరు 21- పాల్ మధ్యాహ్నం 4:30
టెస్టులు
- తొలి టెస్టు- డిసెంబరు 26 - 30 వరకు- సెంచురియాన్ మధ్యాహ్నం 1:30
- రెండో టెస్టు- జనవరి 03 - 07 వరకు- కేప్‌టౌన్ మధ్యాహ్నం 2:00
భారత్ టీ20 జట్టు : యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ , అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, దీపక్ చాహర్.
భారత్ వన్డే జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, ముకేశ్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్.
భారత్ టెస్టు జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ.
సఫారీలనూ చిత్తు చేసిన టీమ్ఇండియా - జడ్డూ మ్యాజిక్కు సౌతాఫ్రికా విలవిల