IND vs SA Series: దక్షిణాఫ్రికాతో త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ జోస్యం చెప్పాడు. సఫారీ జట్టు బ్యాటింగ్ లైనప్ బలహీనంగా ఉన్నప్పటికీ.. బౌలింగ్ దళం మాత్రం పటిష్టంగా ఉందని పేర్కొన్నాడు.
"దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో భారత జట్టు విజయం లాంఛనమే. ఎందుకంటే, టీమ్‌ఇండియాకు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్, మెరుగైన బౌలింగ్ దళం ఉంది. కగిసో రబాడ, ఎన్రిచ్ నోర్జ్టే వంటి బౌలర్లతో దక్షిణాఫ్రికా బౌలింగ్ విభాగం కూడా బలంగానే కనిపిస్తున్నప్పటికీ.. ఆ జట్టు బ్యాటింగ్‌లో సమతూకం లేదనిపిస్తోంది. క్వింటన్ డి కాక్, బవుమాలపైనే బ్యాటింగ్‌పైనే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆధారపడి ఉంది. ఆ జట్టులో ఇంకా బ్యాటర్లు ఉన్నా.. వారంతా కొత్త ఆటగాళ్లే. అందుకే, వీరిద్దరినీ త్వరగా పెవిలియన్ చేరిస్తే.. భారత్ సులభంగా విజయం సాధించగలుగుతుంది" అని దినేశ్ కార్తిక్ జోస్యం చెప్పాడు.
ఇదిలా ఉండగా.. టెస్టు సిరీస్ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు క్వింటన్ డి కాక్, కగిసో రబాడ, టెంబా బవుమా సహా మొత్తం 21 మందితో కూడిన ఆటగాళ్ల వివరాలను వెల్లడించింది.
దక్షిణాఫ్రికా జట్టు ఇదే..
India vs South Africa Test Match Squad: డీన్ ఎల్గర్ (కెప్టెన్), టెంబా బవుమా (వైస్ కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), కగిసో రబాడ, సరెల్ ఎర్వీ, బ్యురాన్ హెండ్రిక్స్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, మర్క్రమ్, వియమ్ మల్డర్, ఎన్రిచ్ నోర్జ్టే, కీగన్ పీటర్సన్, రస్సీ వాన్ డర్ డస్సెన్, కైల్ వెర్రెయిన్, మార్కో జన్సెన్, గ్లెన్‌టన్ స్టూర్మన్, ప్రినెలన్ సుబ్రయెన్, సిసిండా మగళ, ర్యాన్ రికిల్టన్, ఒలివర్