IND VS SA ODI Series Kl Rahul : దక్షిణాఫ్రికా గడ్డపై ఆరేళ్ల తర్వాత వన్డే సిరీస్‌ను గెలుచుకుంది టీమ్ఇండియా. ఆల్‌రౌండ్ షోతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో వన్డేలో సంజూ శాంసన్ అదరగొట్టేశాడు. బౌలింగ్‌లో అర్షదీప్ అండ్ కో దుమ్మురేపారు. అయితే సిరీస్ విజయం తర్వాత టీమ్ఇండియా స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్, దక్షిణాఫ్రికా సారథి మార్‌క్రమ్ మాట్లాడారు.
కెరీర్లో తొలి సెంచరీ సాధించిన సంజూ శాంసన్‌కు కేఎల్ రాహుల్ కొనియాడాడు. "కుర్రాళ్లతో కలిసి ఆడటం ఎప్పుడూ బాగుంటుంది. వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత తొలిసారి మైదానంలోకి అడుగుపెట్టా. వన్డే సిరీస్ గెలవడం ఆనందంగా ఉంది. ఈ జట్టులోని ఆటగాళ్లతో ఐపీఎల్‌లో చాలా మ్యాచ్‌లు ఆడాను. యువ క్రికెటర్లకు నేనిచ్చే సందేశం ఒక్కటే. మీ ఆటను ఆస్వాదించండి. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నించండి. మిగతా వాటి గురించి ఆందోళన చెందొద్దు" అని రాహుల్ చెప్పాడు.
-
𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎 🏆
— BCCI (@BCCI) December 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations to the @klrahul-led side on winning the #SAvIND ODI series 2-1 👏👏#TeamIndia pic.twitter.com/QlaAVLdh6P
">𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎 🏆
— BCCI (@BCCI) December 21, 2023
Congratulations to the @klrahul-led side on winning the #SAvIND ODI series 2-1 👏👏#TeamIndia pic.twitter.com/QlaAVLdh6P𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎 🏆
— BCCI (@BCCI) December 21, 2023
Congratulations to the @klrahul-led side on winning the #SAvIND ODI series 2-1 👏👏#TeamIndia pic.twitter.com/QlaAVLdh6P
"జట్టులో యంగ్ క్రికెటర్లను పాత్రను గుర్తు చేశాను. ఇప్పుడున్నవారిలో మంచి ఆటగాళ్లు ఉన్నారు. కానీ, కొందరికి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన అనుభవం లేదు. అయినా వంద శాతం తమ ప్రదర్శనను ఇవ్వడానికే ప్రయత్నించారు. ఐపీఎల్‌లో సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాడు. కానీ, జాతీయ జట్టుకు వచ్చేసరికి కొన్ని కారణాల వల్ల టాప్‌ఆర్డర్‌లో ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. ఈ మ్యాచ్‌లో మాత్రం తన సత్తా ఏంటో చూపించాడు"
--కేఎల్ రాహుల్, టీమ్ఇండియా స్టాండింగ్ కెప్టెన్
అయితే కీలకమైన మూడో వన్డేలో ఓడిపోవడం తీవ్రంగా బాధించిందని దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్ తెలిపాడు. "పార్ల్ మైదానం చాలా బాగుంది. భారీగా అభిమానులు మ్యాచ్ వీక్షించడానికి వచ్చారు. వారిని మేం నిరాశపరిచాం. జట్టులోని సభ్యులంతా మంచి ఫామ్‌లోనే ఉన్నారు. కానీ, సరైన దిశగా పయనించలేకపోయాం. చివరి వరకూ పిచ్‌లో ఎలాంటి మార్పు రాలేదు. భారత్ నిర్దేశించిన 290 పైచిలుకు లక్ష్యం ఛేదించగలమని భావించాం. బౌలింగ్‌లో బాగానే రాణించినప్పటికీ బ్యాటింగ్‌లో వెనకబడ్డాం. టాస్ అంశం కీలకమే కాదు. రాబోయే టెస్టు సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం. దక్షిణాఫ్రికాలోని రెండు గొప్ప మైదానాల్లో టెస్టులు జరగబోతున్నాయి. క్రికెట్ అభిమానులకు ఇది పండగే" అని మార్‌క్రమ్ తెలిపాడు.
సెంచరీ తర్వాత సంజూ సూపర్ సెలబ్రేషన్ - వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడుగా!
'నా కష్టం మీకు తెలియదు, తెలుగు కుర్రాడు అదుర్స్'- రాహుల్, అర్షదీప్ రికార్డులే రికార్డులు!