ETV Bharat / sports

వరల్డ్​ కప్​ తర్వాత ఫస్ట్ వన్డే- యువ భారత్​కు గట్టి సవాల్​- ఏం చేస్తారో? - భారత్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్

IND Vs SA ODI Series 2023 : దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్‌ను సమం చేసిన భారత్ ఇప్పుడు వన్డే సమరానికి సిద్ధమైంది. ఆదివారం జొహన్నస్‌బర్గ్‌లోని ది వాండరర్స్ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. కేఎల్ రాహుల్‌ నేతృత్వంలోని యువ భారత్‌ మూడు వన్డేల సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని భావిస్తోంది. వన్డే ప్రపంచ కప్ తర్వాత టీమ్​ఇండియా ఆడే తొలి వన్డే సిరీస్‌ ఇదే కావడంతో మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది.

IND Vs SA ODI Series 2023
IND Vs SA ODI Series 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 4:11 PM IST

IND Vs SA ODI Series 2023 : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసిన భారత్‌ ఇప్పుడు వన్డే సవాల్‌కు సిద్ధమైంది. ఆదివారం నుంచి మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభంకానుంది. జొహన్నస్‌బర్గ్‌లోని ది వాండరర్స్ స్టేడియంలో జరగనున్న తొలి వన్డేకు ఇరుజట్లు సన్నద్ధమయ్యాయి. వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్ సారథ్యంలోని భారత్‌ ఈ సిరీస్​ను విజయంతో ఆరంభించాలని చూస్తోంది.

భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం!
మెుదటి వన్డే జరిగే వాండరర్స్ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. వర్ష ప్రభావ సూచనలు ఉండటంతో మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభం కావచ్చు. వాండరర్స్‌ మైదానంలో భారత్‌ రికార్డు అంత గొప్పగా ఏమి లేదు. ఇక్కడ ఎనిమిది వన్డేలు ఆడిన టీమ్ఇండియా కేవలం మూడు మ్యాచ్‌లో గెలిచి ఐదింట్లో పరాజయం చవిచూసింది. ఈ మైదానంలో అతిథ్య జట్టు ఘనమైన రికార్డు ఉండటం టీమ్​ఇండియాను కలవరపెడుతోంది.

వారికి విశ్రాంతి
స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్పులో అద్భుతంగా రాణించిన కేఎల్‌ రాహుల్ ఫామ్‌లో ఉండటం జట్టుకు సానుకూలాంశం. రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కులీదీప్‌ మినహా వన్డే ప్రపంచ కప్పులో బరిలోకి దిగిన ఆటగాళ్లుకు ఈ సిరీస్‌లో విశ్రాంతినిచ్చారు. ప్రధాన ఆటగాళ్లు గైర్హాజరీలో కుర్రాళ్ల ప్రదర్శనపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

ఓపెనర్లుగా రుతురాజ్, సాయి సుదర్శన్!
గత ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున రాణించిన సాయి సుదర్శన్‌తో కలిసి రుతురాజ్‌ గైక్వాడ్‌తో ఆరంభించే అవకాశం ఉంది. తిలక్‌ వర్మ, రజత్‌ పటీదార్‌, శ్రేయస్‌ అయ్యర్, సంజూ శాంసన్, కేఎల్‌ రాహుల్, రింకూ సింగ్‌లతో బ్యాటింగ్‌ విభాగం బలంగా కనిపిస్తోంది. టీ20 సిరీస్‌లో రాణించిన రింకూ సింగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు ఐడెమ్‌ మార్‌క్రమ్ నేతృత్వంలోని సఫారీ జట్టు హిట్టర్లతో నిండిపోయింది. రీజా హెండ్రిక్స్‌, వాండర్‌ డసెన్, డేవిడ్‌ మిల్లర్‌, క్లాసన్‌లతో బ్యాటింగ్‌ విభాగం దుర్బేధ్యంగా కనిపిస్తోంది.

టీమ్​ఇండియాకు గట్టి దెబ్బ!
తండ్రి అనారోగ్యం కారణంగా పేస్‌ బౌలర్‌ దీపక్ చాహర్‌ దూరం కావడం బౌలింగ్‌ విభాగానికి పెద్ద ఎదురుదెబ్బ. అతడి స్థానంలో ఆకాశ్‌ దీప్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. టీ20 సిరీస్‌లో విఫలమైన ముకేశ్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లకు జట్టులో చోటు ఉండాలంటే వన్డేల్లో రాణించాల్సిన అవసరం ఉంది. అవేశ్‌ ఖాన్, ఆకాశ్‌ దీప్‌లో ఒకరు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.

సఫారీల బౌలింగ్ వీక్!
కుల్‌దీప్, చాహల్‌ల ద్వయం స్పిన్ బాధ్యతలను పంచుకోనున్నారు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లోఒకరు బెంచ్‌కు పరిమితం కానున్నారు. మరోవైపు రబడా, ఎంగిడి లేకపోవడంతో సఫారీ బౌలింగ్‌ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. కేశవ్ మహారాజ్‌, షంసీలతో స్పిన్‌ విభాగం బలంగా ఉన్నా పేసర్ల విభాగం బలహీనంగా ఉంది.

MI పై రోహిత్ ఎఫెక్ట్!- గంటలో 4లక్షల మంది అన్​ఫాలో- సూర్య హార్ట్​ బ్రేక్ స్టోరీ

ఏకైక టెస్ట్ మ్యాచ్​లో టీమ్ఇండియాదే పైచేయి- 347పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ చిత్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.