IND vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ అజింక్యా రహానే చెత్త రికార్డు మూడగట్టుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డకౌట్ (మొదటి బంతికే ఔట్)గా వెనుదిరిగాడు రహానే. యువ బౌలర్ ఒలివియర్ ఇతడిని పెవిలియన్ చేర్చాడు. దీంతో తన టెస్టు కెరీర్లో తొలిసారి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగి చెత్త రికార్డు నమోదు చేశాడు రహానే.
లంచ్ బ్రేక్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా లంచ్ బ్రేక్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్, రాహుల్ మొదటి వికెట్‌కు 36 పరుగులు జోడించారు. అనంతరం మయాంక్ (26)ను ఔట్ చేశాడు మార్కో జాన్సెన్. తర్వాత పుజారా (3), రహానే (0)ను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు ఒలివియర్. దీంతో 49 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది భారత్. లంచ్ బ్రేక్ సమయానికి ప్రస్తుతం క్రీజులో రాహుల్ (19), విహారి (4) ఉన్నారు.