ETV Bharat / sports

అలా చేసి ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లం- కానీ!: కేఎల్ రాహుల్ - భారత్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్

IND VS SA 2nd ODI 2023 KL Rahul : మ్యాచ్​లో ఏం జరిగినా మైదానంలోనే వదిలేస్తామని టీమ్​ఇండియా స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. తర్వాత మ్యాచ్​పై ఫోకస్ పెడతామని చెప్పాడు. సఫారీలతో జరిగిన రెండో వన్డే తర్వాత రాహుల్ ఓటమికి కారణాలను వెల్లడించారు.

IND VS SA 2nd ODI 2023 KL Rahul
IND VS SA 2nd ODI 2023 KL Rahul
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 8:23 AM IST

IND VS SA 2nd ODI 2023 KL Rahul : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్​లో ఆల్​రౌండ్ షోతో సత్తా చాటిన టీమ్​ఇండియా రెండో మ్యాచ్​లో తడబడింది. ఫలితంగా గబేహా వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్​ఇండియా సఫారీ బౌలర్ల ధాటికి 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది.

మ్యాచ్ అనంతరం టీమ్​ఇండియా స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడాడు. ఓటమికి గల కారణాలను వివరించాడు. ''మ్యాచ్​లో టాస్ గెలిచి ఉంటే బాగుండేది. ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం సవాలుగా ఉంది. కానీ మేం కుదురుకునే ప్రయత్నం చేశాం. మరో 50-60 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా వచ్చేది. మేం బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు 240-250 మంచి స్కోరుగా భావించాం. ఓ బ్యాటర్ కుదురుకుంటే ఆ స్కోరును సాధించేవాళ్లం. కానీ కీలక సమయంలో వికెట్లు కోల్పోయాం'' అని కేఎల్ రాహుల్ తెలిపాడు.

''జాగ్రత్తగా ఆడాలా, దూకుడుగా ఆడాలా అనేది ప్లేయర్ల పర్సనల్ ప్లాన్. వారికి తగ్గట్టుగా వారు ఆడతారు. క్రికెట్‌లో రైటా రాంగా అని ఉండదు. జట్టు కోసం మన విధిని నిర్వర్తించాలి. బౌలింగ్ విషయానికొస్తే పిచ్ తొలి పది ఓవర్లకు కలిసొచ్చింది. వారిని ఇబ్బంది పెట్టాం కానీ వికెట్లు తీయలేకపోయాం. కానీ సాధించి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేది. ఏం జరిగినా ఆ విషయాన్ని మైదానంలోనే వదిలేస్తాం. తర్వాత మ్యాచ్ గురించి ఫోకస్ పెడతాం''

- కేఎల్ రాహుల్, టీమ్​ఇండియా స్టాండింగ్ కెప్టెన్

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్​ఇండియా 46 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అదే టైమ్​లో బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ (56), యువ ఓపెనర్ సాయి సుదర్శన్‌తో కలిసి (62)ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. కానీ తర్వాత టీమ్​ఇండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. ఛేదనలో దక్షిణాఫ్రికా ఓపెనర్లు డీ జోర్జి (119*), హెండ్రిక్స్ (52) అదరగొట్టారు. తొలి వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో నిర్ణయాత్మక చివర మ్యాచ్ డిసెంబర్ 21న జరగనుంది.

జోర్జి సెంచరీ- సాయి ఇన్నింగ్స్​ వృథా- రెండో వన్డేలో భారత్‌కు సఫారీల షాక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.