Ind vs Sa 1st Test : సౌతాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించేందుకు కెప్టెన్ రోహిత్ శర్మకు మంచి అవకాశం వచ్చింది. గతంలో ఎనిమిదిసార్లు సఫారీ గడ్డపై భారత్ టెస్టు సిరీస్ ఆడింది. ఎందరు కెప్టెన్లు మారినా అందులో ఒక్క సిరీస్‌నూ భారత్ దక్కించుకోలేదు. టీమ్ఇండియాకు వన్డే వరల్డ్‌కప్ సాధించిన కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలోనూ భారత్ భంగపడింది. అయితే తొలిసారి సౌతాఫ్రికా గడ్డపై భారత్‌కు టెస్టు సిరీస్ విజయాన్ని అందించిన కెప్టెన్‌గా నిలిచేందుకు రోహిత్ ముందు ఓ అద్భుతమైన అవకాశం ఉంది.
ఇక రోహిత్ తన కెప్టెన్సీ వ్యూహాలకు పదునుపెట్టి అటు బ్యాటింగ్‌లోనూ రాణిస్తే టీమ్ఇండియాకు తిరుగుండదు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ క్రీజులు ఎక్కువసేపు నిలిస్తే భారత్‌కు భారీ స్కోర్ ఖాయం. అయితే పూర్తిగా పేస్, బౌన్స్‌కు అనుకూలించే సౌతాఫ్రితా పిచ్‌లపై ప్రత్యర్థి బౌలర్లను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా తక్కువ అనుభవం ఉన్న గిల్, జైశ్వాల్, అయ్యర్, భరత్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉంది. అటు బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సఫారీ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టగలిగితే టీమ్ఇండియాకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
-
It is time for the Test series and Captain Rohit Sharma is READY! 💪🏾🙌🏽#TeamIndia | @ImRo45 | #SAvIND pic.twitter.com/EYwvGjuKGw
— BCCI (@BCCI) December 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">It is time for the Test series and Captain Rohit Sharma is READY! 💪🏾🙌🏽#TeamIndia | @ImRo45 | #SAvIND pic.twitter.com/EYwvGjuKGw
— BCCI (@BCCI) December 24, 2023It is time for the Test series and Captain Rohit Sharma is READY! 💪🏾🙌🏽#TeamIndia | @ImRo45 | #SAvIND pic.twitter.com/EYwvGjuKGw
— BCCI (@BCCI) December 24, 2023
అదే ఆఖరిది : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 2021లో సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్ తర్వాత కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. అయితే అంతకుముందే టీ20, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కొంతకాలం టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగాడు. ఇక 2021లో సఫారీలతో టెస్టు సిరీస్ అనంతరం విరాట్ సారధ్య బాధ్యతలు వదులుకున్నాడు. అప్పట్నుంచి రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా కెరీర్ ప్రారంభించాడు.
గతంలో కంటే భిన్నంగా : భారత్- సౌతాఫ్రికా గత టెస్టు సిరీస్ కంటే ప్రస్తుతం టీమ్ఇండియా చాలా భిన్నమైన జట్టుతో ఉంది. జట్టులో చాలా మార్పులు జరిగాయి. దాదాపు జట్టు నిండా యంగ్ ప్లేయర్లే. సీనియర్లు ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ప్రస్తుత జట్టులో లేరు. ఈ ఇద్దరూ లేకుండా టీమ్ఇండియా, సఫారీ గడ్డపై టెస్టు ఆడడం 17 ఏళ్లలో ఇదే తొలిసారి.
సింహంతో గిల్ సెల్ఫీ! 'ఇంత సాహసం అవసరమా బ్రో?'
అందరూ టీమ్ఇండియాకు ఆడాలనుకుంటారు- వరల్డ్‌కప్‌ను దేనితోనూ పోల్చలేం