Ind vs Sa 1st T20 Match : మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, భారత్ (SA vs IND) మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షార్పణం అయింది. టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. టాస్ వేయడానికి నిర్దేశించిన సమయాని కంటే ముందు నుంచే కింగ్స్‌మీడ్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఓవర్లు కుదించి మ్యాచ్ నిర్వహించాలని భావించినా వరుణుడు శాంతించకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మంగళవారం (డిసెంబర్ 12) కెబెరాలోని సెయింట్ జార్జ్ పార్క్ స్టేడియంలో జరగనుంది.
మ్యాచ్ జరగాల్సిన డర్బన్ ప్రాంతంలో వర్షం కురవడం వల్ల తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే రాత్రి 8.20 గంటల తర్వాత ఓవర్లు కుదించి మ్యాచ్ నిర్వహిస్తారని అంతా భావించారు. కానీ, ఎంతసేపటికి వర్షం బ్రేక్ ఇవ్వకపోవడం వల్ల మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో సఫారీ గడ్డపై యంగ్ టీమ్ఇండియా ప్రదర్శన చూద్దాం అనుకున్న భారత్ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది.
-
Not so great news from Durban as the 1st T20I has been called off due to incessant rains.#SAvIND pic.twitter.com/R1XW1hqhnf
— BCCI (@BCCI) December 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Not so great news from Durban as the 1st T20I has been called off due to incessant rains.#SAvIND pic.twitter.com/R1XW1hqhnf
— BCCI (@BCCI) December 10, 2023Not so great news from Durban as the 1st T20I has been called off due to incessant rains.#SAvIND pic.twitter.com/R1XW1hqhnf
— BCCI (@BCCI) December 10, 2023
సౌతాఫ్రికా పర్యటనలో భారత్ షెడ్యూల్
టీ20
- తొలి టీ20 - డిసెంబర్ 10- డర్బన్ రాత్రి 7.30 (వర్షార్పణం)
- రెండో టీ20- డిసెంబర్ 12- కెబెరా రాత్రి 8.30
- మూడో టీ20- డిసెంబర్ 14- జొహన్నెస్‌బర్గ్ రాత్రి 8.30
వన్డేలు
- తొలి వన్డే- డిసెంబరు 17- జొహన్నెస్‌బర్గ్ మధ్యాహ్నం 1.30
- రెండో వన్డే- డిసెంబరు 19- కెబెరా మధ్యాహ్నం 4:30
- మూడో వన్డే- డిసెంబరు 21- పాల్ మధ్యాహ్నం 4:30
టెస్టులు
- తొలి టెస్టు- డిసెంబరు 26 - 30 వరకు- సెంచురియాన్ మధ్యాహ్నం 1:30
- రెండో టెస్టు- జనవరి 03 - 07 వరకు- కేప్‌టౌన్ మధ్యాహ్నం 2:00
భారత్ టీ20 జట్టు : యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ , అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, దీపక్ చాహర్.
సఫారీ గడ్డపై 'యువ' భారత్‌కు సవాల్!- వారితో యంగ్ ప్లేయర్లకు తిప్పలు తప్పవా?