ETV Bharat / sports

ప్రపంచకప్ డిమాండ్ పీక్స్.. హాట్​స్టార్ టార్గెట్ రూ.వెయ్యి కోట్లు.. ఒక్కో యాడ్​కు అన్ని లక్షలా? - ind vs pak wc advertising rates

Ind vs Pak World Cup 2023 : ప్రపంచకప్​ 2023 భారత్ - పాక్ మ్యాచ్​కు రోజురోజుకు హైప్ పెరుగుతోంది. దాయాదుల పోరుకు వేదిక ఖరారు అవ్వగానే అహ్మదాబాద్​లో హోటళ్ల రేట్లు అమాంతం పెరిగాయి. తాజాగా ఈ మ్యాచ్​కు సంబంధించి మరో అప్​డేట్​ వచ్చింది. అదేంటంటే!

hotstar advertising revenue ind vs pak match
ఇండోపాక్ మ్యాచ్ యాడ్స్ రేట్లు
author img

By

Published : Jul 26, 2023, 10:55 PM IST

Ind vs Pak World Cup 2023 : ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ 'డిస్నీ ప్లస్ హాట్​స్టార్'​ ఈ ప్రపంచకప్ 2023లో భారత్- పాక్ మ్యాచ్​ సందర్భంగా.. 10 సెకన్ల అడ్వర్టైజ్​మెంట్​కు దాదాపు రూ. 30 లక్షలు వసూల్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ టోర్నీలో లైవ్​ మ్యాచ్​లన్నింటినీ ఉచితంగానే స్ట్రీమింగ్ చేస్తామని ఇదివరకే ప్రకటించిన హాట్​స్టార్.. ఆదాయం పెంచుకునేందుకు ఈ మేరకు యాడ్స్ ధరలు నిర్ణయించినట్లు సమాచారం. కాగా ఈ ప్రపంచకప్​ ద్వారానే దాదాపు రూ.1000 కోట్లు సంపాదించాలని టార్గెట్​గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే గత ప్రపంచకప్​లో ఇదే హాట్​స్టార్ 10 సెకన్ల అడ్వర్టైజ్​మెంట్​కు సుమారు రూ. 6-7లక్షలు తీసుకోగా.. తాజాగా ఈ రేటును రూ. 30 లక్షలకు పెంచిందట.

ఐపీఎల్​ 2023 హక్కులు కోల్పోయి సమస్యలు ఎదుర్కొంటున్న హాట్​స్టార్.. ఆ నష్టాన్ని పూడ్చుకునే చర్యలు ప్రారంభించిందనే చెప్పవచ్చు. అయితే కో - ప్రజెంటర్స్ అడ్వర్టైజ్​మెంట్ స్లాట్​ ఫీజును రూ. 150 కోట్లుగా హాట్​స్టార్ నిర్ణయించింది. అసోసియేట్ స్పాన్సర్​ల నుంచి రూ. 88 కోట్లు వసూల్ చేయనుంది. హాట్​స్టార్ యాడ్ ధరల ప్రకారం.. 'పవర్డ్ బై' స్పాన్సర్​ అవ్వాలనుకున్న కంపెనీ.. రూ. 75 కోట్లు చెల్లించాలి. ఇక అత్యధిక వ్యూవర్​షిప్ కలిగిన భారత్ - పాకిస్థాన్ మ్యాచ్​కు హాట్​స్టార్​​ ఎక్కువ మొత్తంలో వసూల్ చేయడం హాట్ టాపిక్​గా మారింది. అయితే వరల్డ్ కప్ టోర్నమెంట్.. ఈ బ్రాడ్​కాస్టర్లకు ఓ వరంలాగా మారిందనడంలో సందేహం లేదు.

Ind vs Pak Reschedule : మరోవైపు అక్టోబరు 15న జరగాల్సిన ఇండోపాక్ మ్యాచ్ రీషెడ్యూల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అదే రోజు గుజరాత్‌ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ తేదీని మార్చాలని భద్రతా సంస్థలు బీసీసీఐకి సూచించినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనంలో పేర్కొంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ అధికారులు చెప్పినట్లు తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.