ETV Bharat / sports

Ind vs Pak Weather Condition : భారత్​-పాక్​ ఫైట్​కు వరుణుడు కరుణిస్తున్నాడా! వెదర్ ఎలా ఉందంటే? - ఇండియా వర్సెస్​ పాకిస్థాన్​ సూపర్​ 4 వెదర్​

Ind vs Pak Weather Condition : 2023 ఆసియా కప్​ సూపర్​ 4లో భాగంగా శనివారం కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్​కు వర్షం ముప్పు ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడి వాతావరణం ఎలా ఉందంటే?

Ind vs Pak Weather Prediction
Ind vs Pak Weather Prediction
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 12:45 PM IST

Updated : Sep 10, 2023, 3:52 PM IST

Ind vs Pak Weather Condition : 2023 ఆసియా కప్​లో రెండోసారి జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్​కు ఇంకా కొద్ది సమయమే ఉంది. కేవలం వారం రోజుల గ్యాప్​లోనే దాయాదుల పోరు రెండోసారి జరగడం అనేది క్రికెట్​లో చాలా అరుదు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్​ ఈ మ్యాచ్​ను చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే మ్యాచ్​ వేదికైన కొలంబోలోని వాతావరణం ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్​ను ఆందోళనకు గురిచేస్తోంది. శనివారం నాటి మ్యాచ్​కు.. 90 శాతం వర్షం కురిసే అవకాశాలు​ ఉన్నాయంటూ శ్రీలంక వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. అయితే ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉందంటే..

శనివారం ఉదయం 8 గంటలైన సూర్యుడు దర్శనమివ్వలేదు. సరిగ్గా అదే సమయానికి కొలొంబోని పి. ప్రేమదాస స్టేడియం వద్ద మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ఆ తర్వాత దాదాపు రెండు గంటల తర్వాత సూర్యుడు పలకరించాడు. దీంతో ప్రస్తుతానికి స్టేడియం ప్రాంతంలో వాతావరణం కాస్త పొడిగా మారిందని సమాచారం.

  • Good morning from Colombo Cricket Stadium, it's a bright sunny day here with a couple of clouds. Despite the rain prediction, it's quite humid weather here, hope we'll have full India vs Pakistan game today. #INDvsPAK #PAKvIND pic.twitter.com/ADzFWVI3ao

    — Ahmad Haseeb (@iamAhmadhaseeb) September 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Ind Vs Pak Weather Upate : అయితే కొలంబో వెదర్ అప్​డేట్​లను స్టేడియం వద్ద ఉన్న అభిమానులు ఉదయం నుంచి ఇప్పటి వరకు.. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అక్కడ వాతావరణం క్లియర్​గా ఉన్నట్లు.. వారు పోస్ట్ చేసిన ఫొటోల్లో కనిపిస్తోంది. ఇక లైవ్​లో మ్యాచ్​ను చూసేందుకు ఫ్యాన్స్​ ఇప్పుడిప్పుడే స్టేడియానికి తరలివస్తున్నారు. అలాగే శుక్రవారం జరిగిన బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్​కు వర్షం ఎలాంటి ఆటంకం కలిగించకపోవడం వల్ల ఫ్యాన్స్.. ఈ మ్యాచ్​ కూడా సజావుగా సాగుతుందని ఆశిస్తున్నారు.

మరోవైపు ఈ మ్యాచ్​ను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఫ్యాన్స్​ అందరూ తమ అభిమాన స్టార్స్​ మ్యాచ్​ను చూసేందుకు తరలివస్తున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ అవుతోంది.

Irfan Pathan Ind Vs Pak : ఇక టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా భారత్​-పాక్ మ్యాచ్​ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు కొలంబో ప్రేమదాస స్టేడియానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన మైదానంలో ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేశారు. దాన్ని ఆయన తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు. 'సన్​ డే ఈజ్ ఫన్​ డే. కమాన్ ఇండియా.. టీ20 ప్రపంచకప్​ ఫలితాన్ని రిపీట్ చేయాలి' అని అన్నారు. ఇర్ఫాన్ రికార్డ్ చేసిన వీడియోలో సైతం వాతావరణం పొడిగా ఉన్నట్లు కనిపిస్తోంది.

Asia Cup 2023 Super 4 Reserve Day : రిజర్వ్​ డే పై లంక, బంగ్లాదేశ్ బోర్డులు క్లారిటీ.. 'మాతో చర్చించాకే ఆ నిర్ణయం' ..

Asia Cup 2023 : కొలొంబోను ముంచెత్తున్న వర్షాలు.. అనుకున్నది ఒకటి.. జరుగుతోంది మరోకటి!

Last Updated : Sep 10, 2023, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.