ETV Bharat / sports

Ind vs Pak Top 5 Wicket Takers : ఇండోపాక్ మ్యాచ్​ల్లో అత్యధిక వికెట్ల వీరులు వీళ్లే.. లిస్ట్​లో కుంబ్లే ప్లేస్ ఎంతంటే - భారత్​పై వసీమ్ అక్రమ్ వికెట్లు

Ind vs Pak Top 5 Wicket Takers : భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ అనగానే అనేక మంది టీవీలకు అత్తుక్కుపోతుంటారు. అలా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తి కలిగించే ఈ దాయాదుల పోరులో.. ఇప్పటివరకూ ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో తెలుసుకుందాం.

Ind vs Pak Top 5 Wicket Takers
Ind vs Pak Top 5 Wicket Takers
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 4:42 PM IST

Ind vs Pak Top 5 Wicket Takers : ఇండియా-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అనగానే క్రీడాభిమానుల్లో స్పెషల్‌ క్రేజ్‌ ఉంటుంది. ఈ పోరులో సత్తాచాటి ప్రతిభ నిరూపించుకోవాలని ఇరు జట్ల ఆటగాళ్లు అనుకుంటారు. కొందరు పరుగుల వరద పారించి గ్రేట్‌ అనిపించుకుంటే.. అత్యధిక వికెట్లు తీసి మ్యాచ్​ను మలుపు తిప్పి ఔరా అనిపిస్తారు మరికొందరు. అలాంటి వారికి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆలా ఇండో-పాక్ మ్యాచ్​ల్లో బంతితో రికార్డులు సృష్టించిన ఆటగాళ్లు ఉన్నారు. ఇంతగొప్ప ఘనతను ఎలా సాధించారని అంతా ఆశ్చర్యపోయేలా అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వసీమ్‌ అక్రమ్‌
Wasim Akram : క్రికెట్‌ చరిత్రలో వసీమ్‌ అక్రమ్‌కు ఫాస్ట్‌ బౌలర్‌గా ప్రత్యేక గుర్తింపు ఉంది. నాణ్యమైన పేస్‌తో బంతిని స్వింగ్ చేయడం అతడి ప్రత్యేకత. ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన కీలక మ్యాచ్‌లలో అక్రమ్‌ గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు. 48 వన్డే మ్యాచ్​లు ఆడిన అక్రమ్‌.. 3.73 ఎకానమీ రేట్​తో 60 వికెట్లు తీశాడు. 4/35 అతడి అత్యుత్తమ ప్రదర్శన.

సాఖ్లెయిన్‌ ముస్తాఖ్‌
Mushtaq Saqlain : ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో ముస్తాఖ్‌కు మంచి గుర్తింపు ఉంది. 1990 దశకం చివర్లో 2000 ఆరంభంలో ముస్తాఖ్‌.. భారత్​తో ఆడిన అనేక మ్యాచ్​ల్లో కీలక పాత్ర పోషించాడు. దీంతో క్రికెట్​లో అతడికి 'దూస్రా' అనే ముద్దుపేరు వచ్చింది. భారత్​తో 36 మ్యాచ్​లు ఆడిన ముస్తాఖ్.. 57 వికెట్లు నేలకూల్చాడు. 5/45 అతడి అత్యుత్తమ ప్రదర్శన. క్రికెట్ నుంచి రిటైరయ్యాక ఇతడు.. 2021-22 సమయంలో పాక్​ జాతీయ జట్టుకు ప్రధాన కోచ్​గా వ్యవహరించారు.

అనిల్‌ కుంబ్లే
Anil Kumble : టీమ్ఇండియా లెజెండరీ లెగ్‌ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే అద్భుతమైన బౌలర్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ పిచ్​పై అయినా బంతిని బౌన్స్‌ చేయడంలో కుంబ్లే.. నైపుణ్యం కలిగిన ఆటగాడు. చాలా మ్యాచ్‌లలో పాకిస్థాన్‌ బ్యాటర్లను తికమక పెట్టి.. చిక్కుల్లో పడేసిన సందర్భాలు కుంబ్లే సొంతం. అయితే దాయాది జట్టుపై కుంబ్లేకు ప్రత్యేక రికార్డులే ఉన్నాయి. పాకిస్థాన్‌తో 34 మ్యాచ్‌ల్లో 4.29 ఎకానమీ రేట్​తో కుంబ్లే 54 వికెట్లు తీశాడు. ఇక 4/12 అతడి బెస్ట్ బౌలింగ్‌ ఫిగర్స్‌.

ఆఖిబ్‌ జావెద్‌
Aqib Javed : పాకిస్థాన్‌కు చెందిన ఆటగాడు అఖిబ్‌ జావెద్‌.. మీడియం ఫాస్ట్‌ బౌలర్‌. స్వింగ్‌, బౌన్స్‌ స్కిల్‌తో బౌలింగ్‌ చేయడంలో జావెద్‌ స్టైలే వేరు. ఎలాంటి పిచ్​లపైనైనా బంతిని బౌన్స్​ చేయగల నైపుణ్యం జావెద్ సొంతం. భారత్​తో 39 మ్యాచ్‌లు ఆడిన జావెద్‌.. 54 వికెట్లు తీశాడు. అందులో 7/37 అతడి అత్యుత్తమ ప్రదర్శన.

జవగల్‌ శ్రీనాథ్‌
Javagal Srinath : టీమ్ఇండియా ఫాస్ట్‌ బౌలర్స్‌ జాబితాలో జవగల్‌ శ్రీనాథ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. పేస్‌, కచ్చితత్వంతో కూడిన శ్రీనాథ్‌ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కోవడం ప్రత్యర్థులకు సవాల్ అనే చెప్పాలి. ఇక పాకిస్థాన్‌తో జరిగిన 36 మ్యాచ్‌లలో శ్రీనాథ్‌ 54 వికెట్లు పడగొట్టాడు. 4/49 అతడి అత్యుత్తమ ప్రదర్శన.

India Vs Pakistan Highest Individual Scores : భారత్​ Vs పాక్​ మ్యాచ్​లు.. క్రీజులో ఈ ప్లేయర్స్ దుమ్ములేపేశారుగా!

Virat Kohli Asia Cup 2023 : ఇప్పటివరకు ఓ లెక్క.. ఇకపై ఓ లెక్క.. ఆ టోర్నీల్లో విరాట్ సెన్సేషనల్​ రికార్డులు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.