Ind Vs Pak Super 4 : ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చెలరేగుతున్నారు. 21 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేశారు. టీమ్ఇండియా మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లుగా దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ విజృంభించారు. అర్ధ శతకాలను తమ ఖాతాల్లోకి వేసుకున్నారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
మ్యాచ్ మొదలైందిలా.. ఓ వైపు ఆకాశమే హద్దుగా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చెలరేగిపోగా.. అతనికి రోహిత్ పార్టనర్షిప్ తోడవ్వడం వల్ల స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. గత మ్యాచ్‌లో భారత ప్లేయర్లను ఓ ఆట ఆడుకున్న పాక్ పేసర్ షాహీన్ అఫ్రిదిని.. ఈ మ్యాచ్‌లో గిల్ టార్గెట్ చేశాడు. అతను వేసిన ఇన్నింగ్స్ 3, 5 ఓవర్లలో ఏకంగా ఆరు బౌండరీలు బాదుతూ చెలరేగిపోయాడు. అంతటితో ఆగకుండా .. ఆ తర్వాత కూడా తన దూకుడును అలానే కొనసాగించాడు.
ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో నసీం షా బౌలింగ్‌లో రెండు బౌండరీలు, ఫహీమ్ అఫ్రాఫ్ వేసిన ఓవర్‌లో మరో బౌండరీ బాది నలబైల్లోకి ప్రవేశించిన గిల్..కొద్ది సేపట్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటేశాడు. సుమారు 51 బంతులకు 58 పరుగులు స్కోర్ చేస్తూ దూసుకెళ్లాడు. అయితే షాహీన్ అఫ్రీదీ వేసిన బౌలింగ్‌లో అఘా సల్మాన్ చేతికి చిక్కిన గిల్.. అనూహ్యంగా పెవిలియన్ బాట పట్టాడు.
మరో వైపు ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రోహిత్ కూడా హాఫ్ సెంచరీ మార్క్ దాటాడు. మధ్యలో చాలా నిదానంగా ఆడినప్పటికీ.. నసీం షా వేసిన 10వ ఓవర్‌లో వరుసగా 2 బౌండరీలు బాది తన ఫామ్‌ను ప్రదర్శించాడు. అలా 49 బంతుల్లో 56 పరుగులు తీసిన రోహిత్.. షాదాబ్ ఖాన్ వేసిన 16.4 ఓవర్‌కు భారీ షాట్ ఆడి ఫహీమ్ అష్రాఫ్‌కు చిక్కాడు. దీంతో 121 పరుగుల వద్ద భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 123 పరుగల వద్ద గిల్ వికెట్ కోల్పోడం వల్ల టీమ్ఇండియా రెండో వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ కొనసాగుతున్నారు.
-
1⃣0⃣0⃣-run partnership! 🤝
— BCCI (@BCCI) September 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Captain Rohit Sharma & Shubman Gill continue to score at a brisk pace 👏 👏
Follow the match ▶️ https://t.co/kg7Sh2t5pM#TeamIndia | #AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/QnKhxZkdea
">1⃣0⃣0⃣-run partnership! 🤝
— BCCI (@BCCI) September 10, 2023
Captain Rohit Sharma & Shubman Gill continue to score at a brisk pace 👏 👏
Follow the match ▶️ https://t.co/kg7Sh2t5pM#TeamIndia | #AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/QnKhxZkdea1⃣0⃣0⃣-run partnership! 🤝
— BCCI (@BCCI) September 10, 2023
Captain Rohit Sharma & Shubman Gill continue to score at a brisk pace 👏 👏
Follow the match ▶️ https://t.co/kg7Sh2t5pM#TeamIndia | #AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/QnKhxZkdea