Ind vs Pak Final 2023 : ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఏ.. భారత్ ఏ ముంగిట 353 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణిత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. అయితే పాక్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు అయూబ్ (59), ఫర్హాన్ (65) మెరవగా.. తాహిర్ (108) మెరుపు సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ప్రత్యర్థి జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 2, హంగార్గేకర్ 2, సుతార్, హర్షిత్ రానా, నిషాంత్ సింధు తలో వికెట్ తీశారు.
నో బాల్ దెబ్బ..
టీమ్ఇండియా బౌలర్ హంగార్గేకర్.. కీలకమైన మ్యాచ్‌లో నో బాల్ వేశాడు. ఇన్నింగ్స్ 3.5 ఓవర్ల వద్ద పాక్ ఓపెనింగ్ బ్యాటర్ అయూబ్ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ ధ్రువ్ జోరెల్ అందుకున్నాడు. కానీ ఆ బంతిని అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. ఆ నిర్ణయంతో పాక్ బ్యాటర్ ఆయూబ్ ఊపిరిపీల్చుకున్నాడు. అప్పటికి అతడి స్కోర్ (16 బంతుల్లో 16 పరుగులు). ఈ లైఫ్‌తో చెలరేగి ఆడిన ఆయూబ్.. మరో ఓపెనర్‌తో కలిసి 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఓ రకంగా ఈ పార్ట్నర్షిప్ భారత్ విశ్వాసాన్ని దెబ్బకొట్టిందనే చెప్పవచ్చు.
బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై పాక్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. మొదటి నుంచే దూకుడుగా ఆడి.. తమ జట్టుకు భారీ స్కోరు అందించారు. నాలుగో వికెట్‌గా క్రీజులోకి వచ్చిన బ్యాటర్ తాహిర్.. వీర విహారం చేశాడు. ఏకంగా 4 సిక్సులు, 12 ఫోర్లతో 108 పరుగులు బాదాడు.
-
The only chance in the powerplay was off a no-ball.
— FanCode (@FanCode) July 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
.
.#ACCMensEmergingTeamsAsiaCup #INDvPAKonFanCode pic.twitter.com/Uv9Zx6GSvh
">The only chance in the powerplay was off a no-ball.
— FanCode (@FanCode) July 23, 2023
.
.#ACCMensEmergingTeamsAsiaCup #INDvPAKonFanCode pic.twitter.com/Uv9Zx6GSvhThe only chance in the powerplay was off a no-ball.
— FanCode (@FanCode) July 23, 2023
.
.#ACCMensEmergingTeamsAsiaCup #INDvPAKonFanCode pic.twitter.com/Uv9Zx6GSvh
తేలిపోయిన బౌలర్లు...
నిషాంత్ సింధు మినహా.. మిగతా బౌలర్లంతా ఆరు అంతకంటే ఎక్కువ రన్‌రేట్‌తో పరుగులు ఇచ్చారు. ఆరు ఓవర్లు బౌలింద్ చేసిన హర్షిత్ రానా ఏకంగా 51 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక హంగార్గేకర్ (48), అభిషేక్ (54), ధొడియా (56), సుతార్ (68) పరుగులు ఇచ్చారు.
అయితే లక్ష్యం పెద్దదే అయినప్పటికీ.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. అందుకని భారత ఆటగాళ్లు కాస్త కష్టపడితే ఈ టార్గెట్‌ను అందుకోవడం పెద్ద కష్టమేమీకాదని టీమ్ఇండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు.