Ind Vs Pak Asia Cup 2023 : భారత్ - పాక్ మ్యాచ్ అంటే క్రికెటర్లకు ఎంత టెన్షన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యర్థి జట్టుపై తమ దేశం ఆటగాళ్లు ఆధిపత్యం చలాయించి విజయం సాధించాలంటూ ఇరుజట్ల అభిమానులు ఎంతగానో కోరుకుంటారు. కానీ, కొన్నిసార్లు ఫలితం ఎటూ తేలకుండాపోయి అభిమానులకు చివరికి నిరాశే మిగులుతుంది. శనివారం జరిగిన ఆసియా కప్ 2023 టోర్నీలోనూ సరిగ్గా ఇలానే జరిగింది. శ్రీలంక వేదికగా ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు వర్షం కారణంగా రద్దైంది. రెండుసార్లు వర్షం అంతరాయాల నడుమ టీమ్‌ఇండియా 48.5 ఓవర్లకు 266 పరుగులు చేసి ఆలౌటవ్వగా.. ఆ తర్వాత ఎడతెరిపి లేని వర్షం కురవడం వల్ల పాక్ ఇన్నింగ్స్ ప్రారంభం కాకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. అయితే ఇలాంటి ఘటనలు ఆసియా కప్‌లో చాలానే జరిగాయి. అది ఎప్పుడంటే..
-
The rain has a final say as the match is Called Off!
— BCCI (@BCCI) September 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard ▶️ https://t.co/hPVV0wT83S
#AsiaCup2023 | #TeamIndia | #INDvPAK pic.twitter.com/XgEEkjvrC5
">The rain has a final say as the match is Called Off!
— BCCI (@BCCI) September 2, 2023
Scorecard ▶️ https://t.co/hPVV0wT83S
#AsiaCup2023 | #TeamIndia | #INDvPAK pic.twitter.com/XgEEkjvrC5The rain has a final say as the match is Called Off!
— BCCI (@BCCI) September 2, 2023
Scorecard ▶️ https://t.co/hPVV0wT83S
#AsiaCup2023 | #TeamIndia | #INDvPAK pic.twitter.com/XgEEkjvrC5
అప్పుడు అలా..
Asia Cup 2023 : ఇప్పటి వరకు ఆసియా కప్‌లో భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య వన్డే ఫార్మాట్‌లో 17 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో 1997 ఆసియా కప్‌లో తప్ప మిగతావన్నీ ఫలితాలు వచ్చినవే. ఇది కూడా శ్రీలంక వేదికగా జరిగిన మ్యాచ్ కావడం విశేషం. తొలుత జులై 20న భారత్ - పాక్ మ్యాచ్ ప్రారంభమైంది.
పాక్ బ్యాటింగ్ చేస్తూ 9 ఓవర్లలోనే ఐదు వికెట్ల నష్టానికి 30 పరుగులు మాత్రమే చేసింది. ఆ సమయంలో వర్షం రావడం వల్ల మ్యాచ్ మరుసటి రోజుకు వాయిదాపడింది. అయితే, అప్పుడు కూడా వర్షం తగ్గకపోగా.. మ్యాచ్‌ను రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. ఆ మ్యాచ్‌లో వెంకటేశ్ ప్రసాద్ (4/17), అబే కురువిల్లా (1/10) ధాటికి సయీద్ అన్వర్ (0), ఇంజమామ్ ఉల్ హక్ (0) డకౌట్‌గా వెనుదిరిగారు.
ఆ ఒక్క మ్యాచ్ వర్షార్పణం..
India Vs Pakistan Matches : ప్రస్తుత భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలోని టీమ్‌ఇండియా.. పాక్‌తో ఒకే ఒక్క వన్డే మ్యాచ్ ఆడేందుకు స్కాట్లాండ్‌కు వెళ్లింది. గ్లాస్గో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కావడం ఫ్యాన్స్‌ను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఇక అప్పటి జట్టుకు పాకిస్థాన్ కెప్టెన్‌గా షోయబ్ మాలిక్ వ్యవహరించాడు.
- కెనడా వేదికగా 1997లో పాక్‌తో జరిగిన ఓ మ్యాచ్ కూడా వర్షార్పణమైంది. పాక్ తొలుత బ్యాటింగ్ చేస్తూ 31.5 ఓవర్ల సమయంలో వర్షం రావడం వల్ల మ్యాచ్ ఆగిపోయింది. అయితే అప్పటికి పాక్ స్కోరు 169/3.
- 1989 సీజన్‌లో పాక్ పర్యటనకు భారత్ వెళ్లింది. మూడో వన్డే కూడా ఇలాగే ప్రారంభమైన కాసేపటికే వర్షం కారణం అనూహ్యంగా రద్దు చేయాల్సి వచ్చింది. వర్షం వల్ల 40 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో పాక్ 14.3 ఓవర్లు ఆడి 28/3 స్కోరుతో ఉండగా.. మ్యాచ్ వర్షం కారణంగా ముగిసింది.
- మోహిందర్ అమర్‌నాథ్ నాయకత్వంలోని భారత్ 1984లో పాక్‌కు వెళ్లింది. ఇక రెండో వన్డేలో భారత్ 40 ఓవర్లలో (కుదించిన ఓవర్లు) 210/3 స్కోరు చేసింది. ఆ తర్వాత పాక్ ఛేదనకు దిగాల్సి ఉంది. అయితే, వర్షం రావడం వల్ల మ్యాచ్ ఆగిపోయింది.
Ind vs Pak Asia Cup 2023 : ఆదుకున్న ఇషాన్, హార్దిక్.. ఇక భారమంతా బౌలర్లమీదే
India Vs Pak Asia Cup 2023 : ఇండియా కాదు.. పాకిస్థాన్ కాదు.. వరుణుడిదే ఆఖరి పంచ్