ETV Bharat / sports

Ind vs Nz World Cup 2023 : మెగాటోర్నీలో కివీస్​తో పోరు.. దుమ్ముదులిపిన మన లెజెండరీ క్రికెటర్స్​ వీరే! - indian top run scorers against nz

Ind vs Nz World Cup 2023 : 2023 వరల్డ్​కప్​లో భాగంగా అక్టోబర్ 22 ఆదివారం భారత్.. న్యూజిలాండ్​తో తలపడనుంది. ఈ మెగాపోరుకు ధర్మశాల స్టేడియం వేదికకానుంది. ఈ క్రమంలో ప్రపంచకప్​లో కివీస్​పై అత్యధిక పరుగులు సాధించిన టీమ్ఇండియా బ్యాటర్లెవరో తెలుసుకుందాం.

Ind vs Nz World Cup 2023
Ind vs Nz World Cup 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 4:14 PM IST

Ind vs Nz World Cup 2023 : 2023 ప్రపంచకప్​లో టైటిల్ ఫేవరెట్​గా బరిలోకి దిగిన టీమ్ఇండియా.. అందుకు తగ్గట్లుగానే ఆడుతోంది. ఈ మెగాటోర్నీలో ఓటమి అనేదే లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్​ జట్లను మట్టికరిపించిన రోహిత్ సేన.. మరో కీలక పోరుకు సిద్ధమౌతోంది. అక్టోబర్ 22 ఆదివారం ధర్మశాల వేదికగా న్యూజిలాండ్​తో తలపడనుంది.

అయితే గత ఇరవై ఏళ్లుగా ఐసీసీ టోర్నమెంట్​లలో (వన్డే, టీ20 కలిపి).. కివీస్​తో తలపడిన ప్రతీసారి భారత్​కు భంగపాటు ఎదురైంది. మరి ఆదివారం నాటి మ్యాచ్​లోనైనా న్యూజిలాండ్​ను ఓడించి.. విజయం సాధించాలని టీమ్ఇండియా తహతహలాడుతోంది. అయితే ఇప్పటివరకు జరిగిన వరల్డ్​కప్​లలో.. న్యూజిలాండ్​పై అత్యధిక పరుగులు సాధించిన టీమ్ఇండియా బ్యాటర్లెవరో చూద్దాం.

  1. సునీల్ గావస్కర్..
    టీమ్ఇండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్.. ప్రపంచకప్​లో కివీస్​పై అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో టాప్​లో ఉన్నాడు. గావస్కర్​ తన కెరీర్​లో వరల్డ్​కప్​లో కివీస్​తో నాలుగు మ్యాచ్​లు ఆడాడు. ఆతడు 57.33 సగటుతో 172 పరుగులు నమోదు చేశాడు. అందులో ఓ సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉంది.
  2. మహ్మద్ అజారుద్దీన్..
    టీమ్ఇండియా మాజీ కెప్టెన్ హైదరాబాద్ ప్లేయర్ మహ్మద్ అజారుద్దీన్​కు కివీస్​పై మంచి ట్రాక్ రికార్డే ఉంది. ప్రపంచకప్​ల్లో న్యూజిలాండ్​పై 4 ఇన్నింగ్స్​లు ఆడిన అజారుద్దిన్.. 49 సగటుతో 147 పరుగులు చేసి ఈ లిస్ట్​లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
  3. కపిల్ దేవ్..
    టీమ్ఇండియాకు తొలి వరల్డ్​కప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్.. బ్యాట్​తోనూ రాణించిన సందర్భాలున్నాయి. తన ప్రపంచకప్​ కెరీర్​లో కివీస్​తో నాలుగు మ్యాచ్​లు ఆడిన కపిల్ దేవ్.. 65 సగటున 130 పరుగులు చేశాడు. అందులో 72 నాటౌట్ అతడి అత్యుత్తమ ఇన్నింగ్స్​.
  4. సచిన్ తెందూల్కర్..
    భారత దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్​.. తన కెరీర్​లో 6 వరల్డ్​కప్ ఎడిషన్​లలో భారత్​కు ప్రాతినిధ్యం వహించాడు. అందులో 2003, 2011 ప్రపంచకప్​ ఎడిషన్​లలో సచినే టాప్ స్కోరర్. ఇక తన వరల్డ్​కప్​ కెరీర్​లో 3 మ్యాచ్​ల్లో కివీస్​తో ఆడగా.. అందులో 115 పరుగులు చేసి ఈ లిస్ట్​లో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
  5. అజయ్ జడేజా..
    1992, 1999 వరల్డ్​కప్ ఎడిషన్​లలో రెండు మ్యాచ్​ల్లో కివీస్​తో ఆడాడు. ఈ రెండు మ్యాచ్​ల్లో కలిపి 89 పరుగులు చేసి.. కివీస్​పై వరల్డ్​కప్​లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల లిస్ట్​లో టాప్​ 5 స్థానంలో ఉన్నాడు.

Ind Vs NZ World Cup : కివీస్​తో కీలక పోరు.. ఈ ముగ్గురు మొనగాళ్లను అడ్డుకుంటారా ?

BCCI Team India : రోహిత్​ సేనకు విశ్రాంతి.. బీసీసీఐ స్పెషల్​ పర్మిషన్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.