Ind vs Nz World Cup 2023 : 2023 వరల్డ్‌కప్‌లో భాగంగా ధర్మశాల వేదికగా భారత్ - న్యూజిలాండ్ తలపడుతున్నాయి. 274 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్.. అద్భుతంగా పోరాడుతోంది. ఓపెనర్లు ఇద్దరూ రోహిత్ (46), శుభ్‌మన్ గిల్ (26) ఔటైనా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ నిలకడగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ గిల్.. ఓ అరుదైన మైలురాయి అందుకున్నాడు.
గిల్@2000.. శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌తో వన్డే కెరీర్లో 2వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. గిల్ ఈ ఘనత సాధించేందుకు కేవలం 38 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు.
వన్డేల్లో తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..
- శుభ్‌మన్ గిల్ - 38 ఇన్నింగ్స్
- హషిమ్ ఆమ్లా - 40 ఇన్నింగ్స్
- జహీర్ అబ్బాస్ - 45 ఇన్నింగ్స్
- కెవిన్ పీటర్సన్ - 45 ఇన్నింగ్స్
- బాబర్ అజామ్ - 45 ఇన్నింగ్స్
- రస్సీ వాన్ డర్ డస్సెన్ - ఇన్నింగ్స్
అలాగే వన్డేల్లో 2 వేల పరుగులు పూర్తి చేసిన అతిపిన్న వయస్కుల లిస్ట్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ టాప్‌లో ఉన్నాడు. సచిన్ 20 సంవత్సరాల 354 రోజుల్లోనే ఈ ఘనత అందుకోగా.. గిల్ 24 సంవత్సరాల 44 రోజుల వయసులో సాధించాడు.
-
Fastest to 2⃣0⃣0⃣0⃣ runs in Men's ODIs! 🔓
— BCCI (@BCCI) October 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations Shubman Gill 👏👏 #TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/meRzFIuV0y
">Fastest to 2⃣0⃣0⃣0⃣ runs in Men's ODIs! 🔓
— BCCI (@BCCI) October 22, 2023
Congratulations Shubman Gill 👏👏 #TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/meRzFIuV0yFastest to 2⃣0⃣0⃣0⃣ runs in Men's ODIs! 🔓
— BCCI (@BCCI) October 22, 2023
Congratulations Shubman Gill 👏👏 #TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/meRzFIuV0y
మహ్మద్ షమీ.. ఇదే మ్యాచ్‌లో స్టార్ పేసర్ మహ్మద్ షమీ కూడా అరుదైన ఘనత అందుకున్నాడు. అతడు వరల్డ్‌కప్‌లో టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకూ ప్రపంచకప్‌లో 12 మ్యాచ్‌లు ఆడిమ షమీ.. 36 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అత్యధిక వికెట్లు తీసిన లిస్ట్‌లో మూడో స్థానంలో ఉన్నాడు.
వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన టీమ్ఇండియ బౌలర్లు..
- జహీర్ ఖాన్ - 44 వికెట్లు
- జగవల్ శ్రీనాథ్ - 44 వికెట్లు
- మహ్మద్ షమీ - 36 వికెట్లు
- అనిల్ కుంబ్లే - 31 వికెట్లు
- జస్ప్రీత్ బుమ్రా - 29 వికెట్లు
- కపిల్ దేవ్ - 28 వికెట్లు
-
𝙎𝙥𝙚𝙘𝙩𝙖𝙘𝙪𝙡𝙖𝙧 𝙎𝙝𝙖𝙢𝙞!
— BCCI (@BCCI) October 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
TAKE. A. BOW 🫡#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/EbD3trrkku
">𝙎𝙥𝙚𝙘𝙩𝙖𝙘𝙪𝙡𝙖𝙧 𝙎𝙝𝙖𝙢𝙞!
— BCCI (@BCCI) October 22, 2023
TAKE. A. BOW 🫡#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/EbD3trrkku𝙎𝙥𝙚𝙘𝙩𝙖𝙘𝙪𝙡𝙖𝙧 𝙎𝙝𝙖𝙢𝙞!
— BCCI (@BCCI) October 22, 2023
TAKE. A. BOW 🫡#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/EbD3trrkku
- " class="align-text-top noRightClick twitterSection" data="updated embed link------------------------------ ">updated embed link------------------------------
-
Jadeja Drop Catch : 'ఏంటీ జడ్డూ.. నువ్వేనా క్యాచ్ మిస్ చేసింది'