ETV Bharat / sports

ఆ నిర్ణయం ఇక మేనేజ్​మెంట్ చేతుల్లోనే: రహానే - అజింక్యా రహానే లేటేస్ట్ న్యూస్

కాన్పూర్ వేదికగా భారత్​-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. భారత బౌలర్లు చివరి బంతి వరకు పోరాడినా.. కివీస్ టెయిలెండర్లు రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ వికెట్ పడకుండా అడ్డుకున్నారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఇరుజట్ల కెప్టెన్లు ఇదొక గొప్ప అనుభవమని తెలిపారు.

rahane news, williamson news, రహానే , విలియమ్సన్ లేటెస్ట్ న్యూస్
విలియమ్సన్
author img

By

Published : Nov 29, 2021, 6:01 PM IST

భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. కివీస్ స్పిన్నర్లు రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ పోరాడి కివీస్​ను ఓటమి నుంచి తప్పించారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఇరుజట్లు కెప్టెన్లు రహానే, విలియమ్సన్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎవరు ఏం చెప్పారో చూద్దాం.

"మా సాధ్యమైనంత వరకు గెలుపు కోసం ప్రయత్నించాం. న్యూజిలాండ్ చాలా బాగా ఆడింది. స్పిన్నర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు. శ్రేయస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. చాలా కాలం నుంచి టెస్టు అరంగేట్రం కోసం అతడు ఎదురుచూస్తున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ తర్వాతి మ్యాచ్​ నుంచి అందుబాటులో ఉంటాడు. ఏం జరుగుతుందో అనేది ఇప్పుడే ఏమీ చెప్పలేను. ఏ విషయమైనా మేనేజ్​మెంట్​ నిర్ణయం తీసుకుంటుదని" తెలిపాడు రహానే.

"ఇది అత్యద్భుమైన మ్యాచ్. రోజంతా బ్యాటింగ్ చేయాలని బలంగా అనుకున్నాం. రచిన్, అజాజ్, సోమర్​విల్లేకు ఇదే గొప్ప అనుభూతి. మైదానంలో ప్రేక్షకుల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. పేసర్లు గొప్పగా బౌలింగ్ చేశారు. సుదీర్ఘ స్పెల్​ వేయడం చాలా కష్టం. భారత జట్టు చాలా బలంగా ఉందని మాకు తెలుసు. ముంబయిలో డిఫరెంట్ పిచ్ ఉంటుందని ఆశిస్తున్నా" అంటూ తెలిపాడు న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. "ఇదొక గొప్ప అనుభూతి. మేము చాలా బాగా బౌలింగ్ చేశాం. సాహా, అశ్విన్​తో కలిసి బ్యాటింగ్ చేయడం ఎంజాయ్ చేశా. ఈ మ్యాచ్​లో జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉంది. ఒత్తిడి అనేది కచ్చితంగా ఉంటుంది. కివీస్ కూడా చాలా బాగా పోరాడింది" అని తెలిపాడు.

చివరి రోజు ఆఖరి సెషన్‌లో గొప్పగా పుంజుకున్న భారత బౌలర్లు.. ఐదు వికెట్లు పడగొట్టారు. మరో వికెట్ తీసి ఉంటే భారత్‌ ఘన విజయం సాధించేదే! అయితే, కివీస్‌ టెయిలెండర్లు అజాజ్‌ పటేల్ (2: 23 బంతుల్లో) రచిన్‌ రవీంద్ర (18: 91 బంతుల్లో 2 ఫోర్లు) జాగ్రత్తగా ఆడుతూ టీమ్‌ఇండియా విజయాన్ని అడ్డుకున్నారు. దీంతో భారత్‌ తొలి టెస్టుని డ్రాగా ముగించాల్సి వచ్చింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు, రవిచంద్రన్‌ అశ్విన్‌ మూడు, అక్షర్‌ పటేల్‌, ఉమేశ్ యాదవ్‌ తలో ఒక వికెట్‌ చొప్పున పడగొట్టారు. డిసెంబర్ 3 నుంచి 7 వరకు రెండో టెస్టు వాంఖడే వేదికగా జరగనుంది.

ఇవీ చూడండి: ప్రేయసితో శార్దూల్​ ఠాకూర్ నిశ్చితార్థం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.