Ind vs Nz test 2: వాంఖడే వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ అవుట్ కాలేదని ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశాడు.
వాంఖడే వేదికగా తొలిరోజు మ్యాచ్‌లో 30వ ఓవర్లో అజాజ్ పటేల్ వేసిన బంతి కోహ్లీ ప్యాడ్‌కు తగిలింది. దీన్ని అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. ప్యాడ్ కంటే ముందే బాల్ బ్యాట్‌కు తగిలిందని కోహ్లీ డీఆర్ఎస్ను కోరాడు. బాల్‌కు ప్యాడ్‌కు మధ్య చిన్న స్పైక్ కనిపించింది రిప్లేలో. బాల్ దేనికి ముందు తగిలిందనడానికి సరైన ఆధారాలు లభించలేదు. దీంతో అంపైర్ నిర్ణయాన్నే ఫైనల్ చేశాడు థర్డ్ ఎంపైర్. దీనిపై సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో స్పందించిన వాన్.. కోహ్లీది నాటౌట్‌గా అభిప్రాయపడ్డాడు.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియాకు శుభారంభం దక్కింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(120) నిలకడగా స్కోర్‌బోర్డ్‌ను పరుగులు పెట్టించాడు. శుభ్‌మన్ గిల్(44)తో వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఛెతేశ్వర్ పుజారా క్యాచ్‌తో డకౌట్ అయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ కూడా నిరాశపరిచాడు. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూతో డకౌట్ అయ్యాడు. ఆట పూర్తయ్యే సమయానికి టీమ్ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్ (120), వృద్ధిమాన్ సాహా(25) ఉన్నారు.
ఇదీ చదవండి:తొలి రోజు ఆట అదుర్స్.. శతకంతో కదం తొక్కిన మయాంక్