ETV Bharat / sports

IND vs NZ Test: న్యూజిలాండ్​పై టీమ్ఇండియా అఖండ విజయం - భారత్ న్యూజిలాండ్ రెండో టెస్టు

న్యూజిలాండ్​తో వాంఖడే వేదికగా జరిగిన రెండో టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. 372 పరుగుల తేడాతో గెలిచి 1-0 తేడాతో సిరీస్​ను కైవసం చేసుకుంది.

IND vs NZ
IND vs NZ
author img

By

Published : Dec 6, 2021, 10:19 AM IST

Updated : Dec 6, 2021, 11:12 AM IST

IND vs NZ Test: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా 372 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 140/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్‌ మరో 27 పరుగులే జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. ఆట ప్రారంభమైన గంటలోపే ఆ జట్టు 167 పరుగులకు కుప్పకూలింది. సోమవారం ఉదయం జయంత్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు తీయగా అశ్విన్‌ చివరి వికెట్ తీశాడు. హెన్రీ నికోలస్ (44) పరుగులతో ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో రెండు టెస్టుల సిరీస్​ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది భారత్. కాగా, టెస్టుల్లో భారత్‌కు ఇది పరుగుల పరంగా అత్యంత భారీ విజయం.

టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. అజాజ్‌ పటేల్‌ 10/119 చారిత్రక బౌలింగ్‌ ప్రదర్శన చేయగా.. మయాంక్‌ అగర్వాల్‌ (150; 311 బంతుల్లో 17x4, 4x6), అక్షర్‌ పటేల్‌ (52; 128 బంతుల్లో 5x4, 1x6) కీలక పరుగులు చేశారు. అనంతరం న్యూజిలాండ్‌ బరిలోకి దిగి 62 పరుగులకే కుప్పకూలింది. ఇది భారత్‌లో ఒక టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యల్ప స్కోర్‌. సిరాజ్‌ 3/19 టాప్‌ ఆర్డర్‌ను దెబ్బకొట్టగా తర్వాత అశ్విన్‌ 4/8, అక్షర్‌ 2/14 మిగతా ఆటగాళ్ల పనిపట్టారు. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్​లో 263 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.

ఫాలోఆన్‌ కాదని..

రెండో రోజు ఆటలో న్యూజిలాండ్‌ స్వల్ప స్కోరుకే ఆలౌటై ఫాలోఆన్‌లో పడినా.. టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్ చేసేందుకే మొగ్గుచూపింది. ఈ క్రమంలోనే మయాంక్‌ (62; 108 బంతుల్లో 9x4, 1x6), పుజారా (47; 97 బంతుల్లో 6x4, 1x6) తొలి వికెట్‌కు శతక (107) భాగస్వామ్యం జోడించారు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అజాజ్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యారు. తర్వాత శుభ్‌మన్‌ గిల్‌ (47; 75 బంతుల్లో 4x4, 1x6), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (36; 84 బంతుల్లో 1x4, 1x6) రాణించారు. అయితే, వీరిని రచిన్‌ రవీంద్ర ఔట్‌చేయగా తర్వాత వచ్చిన శ్రేయస్‌ (14), సాహా(13) విఫలమయ్యారు. చివర్లో అక్షర్‌ పటేల్‌ (41; 26 బంతుల్లో 3x4, 4x6) ధాటిగా ఆడి రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు 276/7 స్కోర్‌ అందించాడు.

ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌ చేసి..

మూడో రోజు ఆటలో జయంత్‌ యాదవ్‌(6) ఏడో వికెట్‌గా వెనుదిరిగాక కోహ్లీ ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌ చేశాడు. దీంతో న్యూజిలాండ్‌ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది టీమ్‌ఇండియా. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ మూడో రోజు ఆట నిలిచిపోయేసరికి 140/5తో నిలిచింది. అశ్విన్‌ మరోసారి చెలరేగడం వల్ల ఆదివారమే న్యూజిలాండ్‌ సగం పని అయిపోయింది. డారైల్‌ మిచెల్‌ (60; 92 బంతుల్లో 7x4, 2x6), హెన్రీ నికోలస్ (44; 111 బంతుల్లో 8x4) కాస్త ప్రతిఘటించడం వల్ల ఆట నాలుగో రోజుకు చేరింది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం జయంత్‌ యాదవ్‌ విజృంభించి గంటలోనే మ్యాచ్‌ను పూర్తి చేశాడు.

IND vs NZ Test Scorecard

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 325 ఆలౌట్‌; అజాజ్‌ పటేల్‌ 10 వికెట్లు

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 62 ఆలౌట్‌; అశ్విన్‌ 4 వికెట్లు

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : 276/7 డిక్లేర్డ్‌; అజాజ్‌ 4 వికెట్లు

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ : 167 ఆలౌట్‌; అశ్విన్‌, జయంత్‌ 4 వికెట్లు

Tags: INDvsNZ, INDvsNZ 2ND TEST, INDvsNZ 2ND TEST LIVE, VIRAT KOHLI, AJAZ PATEL, RAVI ASHWIN

ఇవీ చూడండి: అంపైర్లందు ఈ అంపైర్ వేరయా.. వైడ్ సిగ్నల్ ఇలా కూడా ఇవ్వొచ్చా!

Last Updated : Dec 6, 2021, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.