ETV Bharat / sports

IND VS NZ TEST: 12 నిమిషాల్లోనే మ్యాచ్​కు సిద్ధమవ్వాలన్నారు: భరత్

న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలి టెస్టులో గాయపడిన వికెట్ కీపర్ సాహా స్థానంలో బరిలోకి దిగి ఆకట్టుకున్నాడు టీమ్ఇండియా ఆటగాడు కేఎస్ భరత్(KS Bharat Latest News) . అయితే ఈ మ్యాచ్​ కోసం కేవలం 12 నిమిషాల్లోనే తనను సిద్ధమవ్వాలని చెప్పారని తెలిపాడు.

KS Bharat latest news, KS Bharat IND vs NZ match, కేఎస్ భరత్ లేటెస్ట్ న్యూస్, కేఎస్ భరత్ భారత్-న్యూజిలాండ్ మ్యాచ్
Bharat
author img

By

Published : Nov 28, 2021, 8:16 AM IST

న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా మెడ నొప్పి కారణంగా శనివారం మైదానంలోకి రాలేదు. అతడి స్థానంలో కీపింగ్‌ చేసిన కేఎస్‌ భరత్‌(KS Bharat Latest News) తన నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకున్నాడు. చురుగ్గా వ్యవహరించిన అతడు ముగ్గురు కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విషయంపై స్పందించిన భరత్.. తనను 12 నిమిషాల్లోనే మ్యాచ్​కు సిద్ధమవ్వవని చెప్పారని వెల్లడించాడు.

"ఉదయం నేను నా రోజూవారి పని చేసుకుంటున్నా. అంతలోనే సహాయ సిబ్బంది వచ్చి మ్యాచ్​కు సిద్ధమవ్వమని చెప్పారు. కేవలం 12 నిమిషాల్లోనే రెడీగా ఉండాలన్నారు. నేను మైదానంలోకి వచ్చే సమయానికి బంతి చాలా కిందకు వస్తోంది. అందుకు తగ్గట్లు నేను నా పొజిషన్​ను మార్చుకున్నా."

-కేఎస్ భరత్, టీమ్ఇండియా క్రికెటర్

ఈ మ్యాచ్​లో కివీస్‌ ఓపెనర్లు లాథమ్‌ (95), విల్‌ యంగ్ (89), రాస్‌ టేలర్‌ (11) ఔట్‌లో భరత్‌ కీలక పాత్ర పోషించాడు. మరీ ముఖ్యంగా అశ్విన్‌ బౌలింగ్‌లో విల్‌ యంగ్‌ క్యాచ్‌(KS Bharat Catch)ను అందుకున్న భరత్‌.. టీమ్‌ఇండియా అభిమానుల్లో సంతోషాన్ని నింపాడు. అశ్విన్‌ బంతిని కట్‌ చేయబోయిన విల్‌ యంగ్‌ బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకుంది. అయితే అంపైర్‌ నాటౌట్‌ ప్రకటించాడు. వెంటనే కీపర్‌ భరత్‌ డీఆర్‌ఎస్‌కు వెళ్లాలని కెప్టెన్‌ రహానె, బౌలర్‌ అశ్విన్‌కు సూచించాడు. డీఆర్‌ఎస్‌కు వెళ్లిన భారత్‌కు పాజిటివ్‌ రిజల్ట్‌ వచ్చింది. విల్‌ యంగ్‌ బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకున్నట్లు తేలడం వల్ల అంపైర్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అలానే సెంచరీకి చేరువైన లాథమ్‌ను భరత్‌ స్టంప్‌ ఔట్‌ చేశాడు.

ఇవీ చూడండి: వాంఖడే టెస్టుకు ప్రేక్షకులకు అనుమతి.. సామర్థ్యం ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.